వేమూరు, పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి అలపాటి రాజేంద్రప్రసాద్ గెలుపుకు జనసేన పార్టీ పూర్తి సహకారం అందిస్తుందని జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి సోమరౌతు అనురాధ తెలియజేశారు. ఆదివారం పార్టీ ఐటి విభాగం నాయకులు చందు సాంబశివరావు, చవ్వాకుల కోటేష్ బాబులతో కలిసి ఆలపాటిని మర్యాదపూర్వకంగా కలిసి ఎన్నికల ప్రచారంలో అనుసరిస్తున్న విధానాలను గురించి వివరించడం జరిగిందని అనురాధ తెలియజేశారు. ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాలో జనసైనికులు కూటమి అభ్యర్థి అలపాటి గెలుపు కోసం కృషి చేస్తున్నారన్నారు. పార్టీ ఆదేశాల మేరకు పట్టభద్ర ఓటర్లను కలిసి ఓట్లు అభ్యర్థిస్తున్నారని ఆలపాటి గెలుపు కూటమి ప్రభుత్వం పాలనకు గీటురాయిగా ఉంటుందని వివరిస్తున్నట్లు పేర్కొన్నారు. రానున్న రెండు మూడు రోజుల్లో ప్రతి ఓటర్లను కలిసి కూటమి అభ్యర్థి గెలుపు కోసం కృషి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా ఆలపాటి వివరించినట్లు అనురాధ విలేకరులకు తెలియజేశారు. ఆయన కలిసిన వారిలో జనసేన పార్టీ ఐటి విభాగం నాయకులు చందు సాంబశివరావు, చవ్వాకుల కోటేష్ బాబు, కొండవీటి యువ కిషోర్, దేవి రెడ్డి మహేష్, తాడికొండ మురళి తదితరులు ఉన్నారు.
Share this content:
Post Comment