పంచాయతీ కార్యదర్శిని కలసిన జనసేన నాయకులు

ప్రకాశం జిల్లా, కొండేపి నియోజకవర్గం, సింగరాయకొండ మండలం, ములగుంట పాడు గ్రామ పంచాయితీలో సుమారు ఆరు నెలల క్రితం జనసేన పార్టీ పర్యటించి ప్రజలు డ్రైనేజీలు లేక పడుతున్న ఇబ్బందులు మూలగుంటపాడు గ్రామపంచాయతీ కార్యదర్శికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది. కానీ నేటికీ ఒక్క డ్రైనేజీ కూడా నిర్మించకపోవడం ఈ వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. ఈ విషయం గురించి గురువారం మూలగుంటపాడు గ్రామపంచాయతీ కార్యదర్శి నజీర్ ను, జనసేన పార్టీ మండల అధ్యక్షులు ఐనా బత్తిన రాజేష్ వివరణ అడుగగా విద్యానగర్ నాలుగు, ఐదు, లైన్ లకు నూతన డ్రైనేజ్ నిర్మించటానికి తీర్మానం చేయడం జరిగిందని, సదరు కాంట్రాక్టర్ కు ఇచ్చినామని త్వరలోనే పనులు మొదలు పెడతామని మూలగుంట గ్రామపంచాయతీ కార్యదర్శి నజీర్ చెప్పడం జరిగినది. కానీ ప్రజలు పదే పదే మూలగుంట పాడు గ్రామపంచాయతీ నుండి చేస్తాము అని చెప్పడమే తప్ప, చేసిన పాపన పోలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ప్రజలకు చెప్పే సమాధానం హేతుబద్ధంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నరని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో సింగరాయకొండ మండల జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.