చిల్లపల్లి నాగేశ్వరరావుకు నివాళులు అర్పించిన జనసేన నాయకులు
జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం చైర్మన్, మంగళగిరి నియోజకవర్గం ఇంచార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు తండ్రిగారు శ్రీచిల్లపల్లి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవస్థాపకులు స్వర్గీయ చిల్లపల్లి నాగేశ్వరరావు మంగళవారం మధ్యాహ్నం ఆయన స్వగృహంలో కన్ను మూశారు.
బుధవారం ఉదయం జనసేన పార్టీ గుంటూరు జిల్లా కార్యదర్శి డేగల లక్ష్మణ్ మరియు జిల్లా ఫ్రోగ్రాం కమిటీ సభ్యులు యడ్ల వెంకటేశ్వరరావు, గుంటూరు రూరల్ మండల కార్యదర్శి ముళ్ళపూడి చిన్న తదితరులు భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-10-at-8.13.29-PM-768x1024.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-10-at-8.13.29-PM-1-1024x768.jpeg)