అడపా దుర్గాప్రసాద్ కుటుంబానికి జనసేన నాయకుల పరామర్శ

  • అమలాపురం జనసేన తరపున 50వేలు ఆర్థికసాయం

కోనసీమ జిల్లా, జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవసభలో పాల్గొని తిరిగి వస్తూ గుండె పోటుతో ఆకస్మికంగా అమలాపురం నియోజకవర్గం, ఈదరపల్లి గ్రామానికి చెందిన జనసైనికుడు అడపా ప్రసాద్ (చిన్న) మరణించారు. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం, జనసేన పార్టీ శాసనమండలి ప్రభుత్వ విప్, ఎమ్ ఎల్ సి. పి.హరి ప్రసాద్ సూచనల మేరకు అమలాపురం నియోజకవర్గం నాయకులు నల్లా శ్రీధర్ ఆధ్వర్యంలో కుటుంబాన్ని పరామర్శించి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు. మృతుడి తల్లికి తక్షణ ఖర్చులు నిమిత్తం అమలాపురం జనసేన తరపున 50,000/- రూపాయలు అందించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు యాళ్ళ నాగ సతీష్, కల్వకొలను తాతాజీ, ఏడిద శ్రీను, లింగొలు పండు, కంచిపల్లి అబ్బులు, డా.నాగ మానస, నల్లా వెంకటేశ్వరరావు, గట్టెం వీరు, కరిం బాబా, ఎమ్ డి షరిముల్ల, నల్లా మూర్తి, కొప్పుల తాతాజీ, బండారు సురేష్, నల్లా చైతన్య, గ్రామ జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Share this content:

Post Comment