కాండ్రు శ్యాముకు పరామర్శించిన జనసేన నాయకులు

ఉమ్మడి కృష్ణా జిల్లా, నందిగామ నియోజకవర్గం, కంచికచర్ల మండలంలో దళిత యువకుడు కాండ్రు శ్యామును కొంతమంది యువకులు చిత్రహింసలకు గురి చేయడంతో బాధితుడు విజయవాడ ఆంధ్ర హాస్పిటల్ లో చికిత్స పొందుతుండగా ఉమ్మడి కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు బండ్రెడ్డి రామ్, జనసేన పార్టీ సీనియర్ నాయకురాలు తంబళ్లపల్లి రమాదేవి బాధితుడుని పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా బండ్రెడ్డి రామ్ మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక మంది దళితుల మీద ఈ రాష్ట్రంలో అనేక దాడులు జరగడం జరిగింది. ఈ సమాజం సిగ్గుచేటుగా కాండ్రు శ్యామ్ మీద మూడు రోజుల క్రితం జరిగిన దాడి ఈ రాష్ట్రంలో చాలా సిగ్గుచేటు. అలాగే అధికార పార్టీ అహంతో మధంతో బాధితుడిపై మూత్రం పోసి అవమానించడం ఎంతవరకు సబబు…? పైపెచ్చు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దళితులకి నేను మేనమామని అని చెప్పుకుంటూ.. నువ్వు దళితులకి న్యాయం చేయలేని ముఖ్యమంత్రిగా ఉండటం అవసరమా…! అలాగే జనసేన సీనియర్ నాయకురాలు తంబళ్లపల్లి రమాదేవి మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో మా దళితుల మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఇంత వివక్షత చూపించడం ఎంతవరకు న్యాయం? ఇంతవరకు దళిత మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించకపోవడం చాలా ఆశ్చర్యకరం. దళిత ద్రోహి ఆదిమూలపు సురేష్ కనీసం బాధితుడిని పరామర్శించలేనంత తీరిక లేకపోవడం న్యాయమా…? నువ్వు ఒక దళిత కుటుంబంలో పుట్టి దళిత మంత్రివి అవ్వడం దళితులు చేసుకున్న శాపం. జనసేన పార్టీ కాండ్రు శ్యాము కుటుంబానికి అండగా నిలబడుతుందని బాధితులకు సరైన న్యాయం జరిగేంతవరకు పోరాటం కొనసాగిస్తామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కంచికచర్ల మండల అధ్యక్షులు నాయిని సతీష్, చందర్లపాడు మండల అధ్యక్షులు వడ్డెల్లి సుధాకర్, నందిగామ పట్టణ అధ్యక్షులు తాటి శివకృష్ణ, వీరులపాడు మండల అధ్యక్షులు బేతంపూడి జయరాజు, నియోజకవర్గ నాయకులు పూజారి రాజేష్, సురా సత్యనారాయణ, పొన్నవరం వార్డు మెంబర్ పసుపులేటి శ్రీనివాసరావు, జనసేన పార్టీ కార్యకర్తలు జనసైనికులు పాల్గొన్నారు.