వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను పరామర్శించిన జనసేన నాయకులు

నందికొట్కూరు, గడివేముల మండలంలోని మంచాలకట్ట, గని గ్రామాల్లో మరియు మిర్టూరు మండలంలోని తలముడిపి, జలకనూరు గ్రామాల్లో గత మూడు రోజుల కిందట భారీ వడగండ్లతో కురిసినటువంటి వర్షానికి రైతులు చాలా నష్టపోయారు. ముఖ్యంగా మిరప, మొక్కజొన్న, అరటి తోట రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ పంటలు వేసినటువంటి రైతులు ఎక్కువగా కౌలు రైతులు వారిలో చాలామంది రైతులకు కౌలు కార్డు కూడా లేదు. కనుక ప్రభుత్వ అధికారులు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని నిజాయితీగా విచారణ జరిపి పంట ఎవరైతే వేశారో ఎవరైతే నష్టపోయారో వారికే నష్టపరిహారం ప్రభుత్వం నుంచి ఇవ్వాలని జనసేన పార్టీ పాణ్యం ఇంచార్జ్ చింత సురేష్ బాబు మరియు నందికొట్కూరు నియోజకవర్గం నుంచి నల్లమల్ల రవికుమార్ డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కోడుమూరు నియోజకవర్గం నుంచి అకేపోగు రాంబాబు, కర్నూల్ నుండి మంజునాథ, సుధాకర్, లక్ష్మన్న తదితరులు దాదాపు మూడు రోజులు పొలాల్లో పర్యటించి రైతులతో నేరుగా చర్చించడం జరిగింది. రైతులు చెమటూర్చి కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయానికి ఈ వడగళ్ల వాన రావడం వల్ల కన్నీరు మున్నిరు అవుతున్నారు. కనుక ప్రభుత్వం వీటిని గ్రహించి తక్షణమే వారికి నష్టపరిహారం చెల్లించాలని కోరడం జరిగింది.