పాతకోట గ్రామ సచివాలయాన్ని సందర్శించిన జనసేన నాయకులు

అరకు, జనసేన పార్టీ అరకు పార్లమెంట్ ఇంచార్జ్ డాక్టర్ వంపూరి గంగులయ్య హుకుంపేట మండలం పాతకోట గ్రామ సచివాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజలకు అందిస్తున్న సేవలను సచివాలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని సిబ్బందికి సూచించారు. తర్వాత ఉప్ప గ్రామంలో జనసేన పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు సురకత్తి రాంబాబు సతీమణికి ఆరోగ్యం బాగాలేని కారణంగా పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల జనసైకులు కోటేశ్వరరావు పడాల్, నాగరాజు బూడిద, అశోక్, శోభన్ దుడ్డు మరియు పోసల గరువు జనసైనికులు పాల్గొన్నారు.