ఖాదర్ అమ్మాజీకి మనోధైర్యాన్నిచ్చిన జనసేన నాయకులు

రామకృష్ణాపురం గ్రామ కాపురస్తులు అయిన కన్న ఖాదర్ అమ్మాజీ కుమారుడు అహ్మద్ వలీ కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నాడు, హార్ట్ లో హోల్ ఉందని తెలిసింది. అబ్దుల్ ఖాదర్ జిలానీ ఈ విషయాన్ని ఏ.పి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ మరియు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి ఆ కుటుంబాన్ని పరమర్శించి వాళ్లకి ధైర్యం చెప్పారు. రంజాన్ మాసం కానుకగా జనసేన పార్టీ యు.ఏ.ఈ కన్వినర్ కె.డి.వి.ఎస్.నారాయణ, అన్సార్వల్లి(బుజ్జి), 66వ వార్డు జనసేన పార్టీ ఉపాధ్యక్షులు అబ్దుల్ ఖాదర్ జిలానీ, మహ్మద్ అక్రమ్, కృష్ణ, చేతన్ ల సహకారంతో పండగ ఖర్చుల నిమ్మితం రూపాయలు 10000/- ఆర్దిక సహాయం చేసారు.

Share this content:

Post Comment