తల్లి, తండ్రి లేని పిల్లలకు నీడ ఏర్పాటు చేసిన పిడుగురాళ్ల జనసేన

గురజాల, పిడుగురాళ్ల, కరోనాతో తండ్రి కాలం చేస్తే కన్న తల్లి పిల్లలను ఆనాధలుగా వదిలేస్తే అకాల వర్షం నిలువ నీడ లేకుండా చేసిన పిల్లలను జనసేన నాయకులు ఆదుకున్నారు. పిడుగురాళ్ల పట్టణంలో 26 వార్డు రిక్షా కాలనిలో నివసిస్తున్న బచ్చలకూర ఆనందరావు కరోనాతో చనిపోయారు. భార్య పిల్లల్ని వదిలేసి ఇంకొక పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. భారీ వడగళ్ల వానతో రేకులు కూడా ఎగిరిపోయి నిలువ నీడ లేకుండా పోయి, బిక్కు బిక్కు, మంటున్న పిల్లలకు జనసేన పార్టీ మండల అధ్యక్షుడు కామిశెట్టి రమేష్ అండగా నిలబడ్డారు. విషయం తెలుసుకొని తానే స్వయంగా వెళ్లి పరామర్శించారు. ఆదుకుంటామని హామీ ఇచ్చారు. విషయాన్ని జనసేన పార్టీ నాయకులతో చర్చించారు. దీనితో అనేక మంది దాతల స్పందించి సహాయం చేసారు. వచ్చిన మొత్తంతో ఇంటికి రేకులు వేయించి వారికి నిత్యావసర సరుకులను అందజేశారు. పవన్ కళ్యాణ్ స్పూర్తితోనే సహయలు చేస్తున్నామని, అధికారం లేకపోతేనే ఇంత మంది పేదవారిని ఆదుకుంటూన్నామని. రేపు అధికారమిస్తే బడుగు బలహీన వర్గాలు వారికి అండగా ఉంటాని మండల అధ్యక్షుడు కామిశెట్టి రమేష్ అన్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఒక్కరూ కూడా స్పందించలేదని ఇది చాలా దారుణమని అన్నారు. జిల్లా సంయుక్త కార్యదర్శి ఖాసీం మాట్లాడుతూ… ఆనందరావు కుటుంబాన్ని ఆదుకోవడం జనసేన నాయకులు, కార్యకర్తలు మానవత్వం కలవారని వారికి మాత్రమే సాయం చేసే గుణం ఉంటుందని అన్నారు. వీరి కుటుంబానికి జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని, ఈ కార్యక్రమంతో ప్రభుత్వానికి ఇప్పటికైనా కళ్ళు కనువిప్పు కావాలని అన్నారు. నియోజకవర్గ ఐటి కోఆర్డినేటర్ మునగా వెంకట్ మాట్లాడుతూ.. అకాల వర్షంతో నిలువనీడ లేకుండా పోతే మున్సిపాలిటీ అధికారులు గాని, ఎమ్మెల్యే గాని స్పందించలేదని, ఇదేనా పేద వారి పట్ల మీకున్న ప్రేమని మునగా వెంకట్ అన్నారు. జనసేన పార్టీకి వారికి అండగా నిలబడం అభినందనీయమని అన్నారు. అకాల వర్షాలతో కూలిన ఇంటిని తిరిగి నిర్మించి వారికి అందజేయడం గొప్ప విషయమని, పిల్లలకు భవిష్యత్ లో ఏ అవసరం వచ్చినా అండగా ఉంటామని నూతి సూరి నారాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు దూదేకుల సలీం, మండల ఉపాధ్యక్షులు బయ్యవరపు రమేష్, మండల ప్రధాన కార్యదర్శి గుర్రం కోటేశ్వరరావు, కార్యదర్శి బేతంచర్ల నాగేశ్వరరావు, రామాయణం రామయ్య, కండేపూడి వంశి, నాయకులు బేతంచెర్ల ప్రసాద్, గుర్రం రామకోటేశ్వరరావు, అబిశెట్టి ఆంజనేయులు, నెకరకంటి నర్సి, రామిశెట్టి సురేష్ మొదలగువారు పాల్గొన్నారు.