బుచ్చయ్యగారి పల్లె నివాసికి ఆర్ధికసాయమందించిన పత్తి చంద్రశేఖర్

పుట్టపర్తి, బుక్కపట్నం మండల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పత్తి చంద్రశేఖర్ బుచ్చయ్యగారి పల్లె నివాసి అయిన ఆంజనేయులుకి రూపాయలు 20000/- ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా బుక్కపట్నం మండల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పత్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ… స్వతహాగా జానపద కళాకారుడు అయిన ఆంజనేయులు కరోనా కాలంలో ఉపాధి అవకాశాలు లేక చదువుకోవడానికి డబ్బు లేక ఇబ్బంది పడుతుంటే యువత చదువుకొని పురోభివృద్ధి సాధించాలని, అంతే కానీ ఆర్ధిక ఇబ్బందితో తిరోగమనం వైపు వెళ్ళకూడదని, నా మనసు చలించి నా వంతు సాయంగా రూపాయలు 20000/- ప్రకటించడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం బుధవారం రూపాయలు 20000/- చెక్కును అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.