జనసేన జానీజి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జనసేన నాయకులు

పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలం జనసేన పార్టీ నాయకులు మరియు “బోడ్లపాడు, తూడి, రేగులపాడు” గ్రామాల ఉమ్మడి ఎంపిటిసి అభ్యర్థి వజ్రగడ రవికుమార్ (జనసేన జానీ) ప్రజారాజ్యంతో మొదలుపెట్టిన ఈ రాజకీయ ప్రస్థానంలో, ఒక సామాన్య ఆటో డ్రైవర్ గా ఉంటూ…మెగా ఫ్యామిలీ కోసం వారు కోరుకున్న ఆశయ సాధన కోసం నిరంతరం శ్రమించిన జనసేన జానీకి పాలకొండ నియోజకవర్గ జనసేన జనాయకులు మరియు జనసైనికులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు. 2014 నుంచి జనసేన పార్టీ ప్రస్థానం మొదలు కొణిదల పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాలను అలవర్చుకుని, ఈ సమాజంలో మార్పు తీసుకురావాలనే కోరిక.. నువ్వేసే ప్రతి అడుగులో పవన్ కళ్యాణ్ ఆశయాలు, నలు దిక్కుల వేసే అడుగులో పార్టీ కోసం చేసే కృషి, పవన్ కళ్యాణ్ గెలవాలని ఒక కట్టుదిట్టమైన సంకల్పంతో చేసే కఠోర దీక్ష.. ఈరోజు ఎవరో జనసేన జానీ అంట అనే ఒక్క మాటతో మెగా పవన్ కళ్యాణ్ మరియు నాగబాబుల హృదయాలను గెలుచుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు అల్లు సాయి మత్స పుండరికం, పోరెడ్డీ ప్రశాంత్, రమేష్ పొట్నురు పాల్గొనడం జరిగింది.