జనంకోసం జనసేన మహా పాదయాత్ర

రాజానగరం, ఏడవ రోజు జనంకోసం జనసేన మహా పాదయాత్ర రాజనగరం నియోజకవర్గం, సీతానగరం మండలం, కూనవరం గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను సిద్ధాంతాలను వివరిస్తూ ఈసారి పవన్ కళ్యాణ్ కి అవకాశం ఇవ్వాలని జనసేన పార్టీని ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తూ ముందుకు సాగుతూ గురువారం జనంకోసం జనసేన మహా పాదయాత్ర కార్యక్రమం జరిగింది. రాజనగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మట్ట వెంకటేశ్వరరావు, ముత్యాల హరీష్, మోహన్ పిఎస్పీకే, తోట సూర్య మణికంఠ, మండల నాయకులు మట్ట వేంకటేశ్వరరావు, ప్రశాంత్ కుమార్, కొండేటి సత్యనారాయణ, శ్రీహరి ప్రగడ, మూర్తి, వీర్రాజు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.