గెలుపే లక్ష్యంగా ఉద్యమంలా ముందుకు సాగనున్న జనం కోసం జనసేన మహాపాదయాత్ర

  • ఆడపడుచులకు బొట్టు పెట్టి”… ఈసారి జనసేన పార్టీకి అవకాశం ఇవ్వాలని…. శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి నేతృత్వంలో విజ్ఞప్తి చేయనున్న వీరమహిళలు..
  • సమసమాజ స్థాపన లక్ష్యం కోసం అడుగులో అడుగు వేయనున్న జనసైనికులు..
  • ప్రజా మనసులు గెలుపొందడానికి ఎన్నికల ప్రణాళిక సర్వం సిద్ధం..

రాజానగరం: ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అవినీతి, అక్రమాలపై రాజీలేని పోరాటం చేస్తూ.. క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ అభివృద్ధి కోసం ఓ ఉద్యమకారుడిలా, ఓ స్వచ్ఛంద సేవకుడిలా అలుపెరుగని పోరాటం చేస్తూ…. రాజానగరం నియోజకవర్గంలో జనసేన పార్టీ గ్రాఫ్ ఆకాశమంత ఎత్తు పెంచిన ప్రజానాయకులు బత్తుల బలరామకృష్ణ మరియు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి శనివారం నుండి జనశ్రేణులతో సంయుక్తంగా పూర్తిస్థాయి ఎన్నికల ప్రచారానికి సిద్ధం కానున్నారు.. శుక్రవారం గాదరాడ గ్రామంలో ఓం శివశక్తి పీఠం నందు ఎన్నికల ప్రచారం మరియు రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ ఘన విజయం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించి, ఈ నూతన కార్యక్రమం లాంఛనంగా ప్రారంభించారు.. రాజానగరం మండలం, కొండగుంటూరు గ్రామంలో.. 25వ తేదీన శనివారం మధ్యాహ్నం 3.00 గంటల నుండి “జనం కోసం జనసేన” “మహాపాదయాత్ర” భాగంగా మరొక అంశాన్ని చేర్చుతూ.. ప్రతీ ఆడపడుచుకు “బొట్టు పెడుతూ” “ఈసారి జనసేన పార్టీకి అవకాశం ఇవ్వాలని” అభ్యర్థిస్తూ… ప్రతి ఇంటికి జనసేన పార్టీ డోర్ స్టిక్కర్, ఒక కీచైన్, ఒక పొకెట్ బ్యాడ్జీ, ఒక కరపత్రం ఇచ్చి.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీకి ఒక అవకాశం ఇచ్చి, అధినేత పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిని చేయాలని విజ్ఞప్తి చేస్తూ.. శ్రీకారం చుట్టనున్న ఈ మహా ఎన్నికల సంగ్రామంలో జనసేన పార్టీ ఘనవిజయం సాధించాలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఈ ఎన్నికల ప్రచారంలో.. రాజానగరం నియోజకవర్గంలోని సీనియర్ జనసేన నేతలు, జనసైనికులు, వీరమహిళలు తప్పనిసరిగా పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తిచేస్తూ.. ఈ రాక్షస, అరాచక పాలన పై గళమెత్తుదాం.. ప్రజా సమస్యలపై జనసేన పోరుబాట కొనసాగిద్దాం.. సమైక్యంగా పోరాడి, విజయబావుటా ఎగరవేసి నియోజకవర్గంలో జనసేన జెండా సగర్వంగా ఎగరేద్దాం.. రండి తరలిరండి.. ఛలో కొండగుంటూరు అంటూ పిలుపునిచ్చారు.