88 వార్డ్ లో అంగరంగ వైభవంగా జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సంబరాలు

  • 88 వార్డ్ అధ్యక్షులు వబ్బిన జనార్ధన శ్రీకాంత్ సొంత నిధులతో పారిశుద్ధ కార్మికుల పరికరాల కోసం 10 వేలు సచివాలయం సానిటరీ ఇన్స్పెక్టర్ జగన్ కి ఇవ్వడం జరిగింది

పెద నరవ, 88 వార్డ్, పెందుర్తి నియోజకవర్గంలో వార్డ్ అధ్యక్షులు వబ్బిన జనార్ధన శ్రీకాంత్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ 12 వ ఆవిర్భావ సంబరాలు అంగరంగంగా వైభవంగా, జనసేన పార్టీ సభ్యులు నడుమ, పారిశుద్ధ కార్మికులు చే కేక్ కటింగ్ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది. మీడియాతో మాట్లాడుతూ ఈరోజు జరుపుకుంటున్న ఈ 12వ ఆవిర్భావ చాలా ప్రాముఖ్యత ఉందని, 100% స్ట్రైక్ రేట్ ప్రపంచంలో ఏ పార్టీ లేని ఘనత ఈ మన జనసేన పార్టీకి ఉందని, పవన్ కళ్యాణ్ గారు ఒక యాక్టర్ గా, ప్రతిపక్ష నాయకుడిగా, ఇప్పుడు అధికార పార్టీ నాయకుడిగా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అటు ప్రజలకి, ఇటు ప్రభుత్వాలకు అండగా నిలబడడం చూసి ఆ స్ఫూర్తితో మేము కూడా ప్రభుత్వానికి అండగా నిలబడాలని నా సొంత నిధులతో మా నరవ వార్డు సచివాలయానికి పారిశుద్ధ కార్మికుల పరికరాల కోసం 10 వేలు ఇవ్వడం జరిగిందని, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అడపాదడపా సినిమాలు చేస్తూ వచ్చిన ఆదాయాన్ని ఇటు జనసేనపార్టీకి, ప్రజలకు మరియు ప్రభుత్వాలకు తన సొంత నిధులతో సహాయం చేస్తున్నారని కావున రేపటి తరం భవిష్యత్తు కోసం ఈ జనసేన పార్టీ మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అండగా మనందరం నిలబడాలి కావున నా సేన కోసం నా వంతు లో భాగంగా ప్రతి ఒక్కరూ మన జనసేన పార్టీకి ఎంతో కొంత ఆర్థిక భరోసా కల్పించాలని మీడియా ద్వారా ప్రతి ఒక్కరిని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీరమహిళ వెంకటరత్నం, స్థానిక నాయకులు గల్లా శ్రీనివాస్, గంగు నాయుడు, సూరిబాబు, మళ్ళ తాతబాబు, లింగం వాసు, గవర రాజు, గవర శీను, ఓమ్మి అప్పలరాజు, ఎల్లపు రాము, మహేష్, నవీన్, కుమార్ మరియు జనసైనికులు, ప్రజలు పాల్గొన్నారు.

Share this content:

Post Comment