అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లను నిర్మించాలని జనసేన పార్టీ డిమాండ్

సర్వేపల్లి నియోజకవర్గం: ముత్తుకూరు మండలం పోల్లంరాజుగుంట గ్రామానికి వెళ్లేటువంటి ఆర్ అండ్ బి రోడ్డు అద్వాన్నంగా మారడంతో ఆదివారం ముత్తుకూరు మండల జనసేన పార్టీ నాయకులతో కలిసి సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు పరిశీలించారు. బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పాలన వికేంద్రీకరణ అని చెప్పి ఆర్భాటాలు చేసుకుంటుందే తప్ప రాష్ట్రంలో అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లపై దృష్టి పెట్టే పరిస్థితి లేదు. సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కి రెండుసార్లు ఓట్లేసి గెలిపించారు. 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సర్వేపల్లి నియోజకవర్గంలోని అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లమీద దృష్టిపెట్టిన దాఖలాలు లేవు. అదేవిధంగా మూడున్నర సంవత్సరం నుంచి అధికారపక్షంలో ఉండి మంత్రి అయిన తర్వాత కూడా అస్తవ్యస్తంగా ఉన్న ముత్తుకూరు మండలం పొల్లంరాజుగుంట గ్రామానికి వెళ్లేటువంటి రోడ్డు బారకి ఒక గుంట మూరకి ఒక గొయ్యి మారింది. కనీసం ఆ గుంటలను ప్00డ్చలనే ఆలోచన కూడా లేనటువంటి పరిస్థితి. అదే విధంగా పొల్లఒరాజుగుంట నుంచి ఉల్సా హరిజనవాడికి వెళ్లేటటువంటి రెండు కిలోమీటర్ల రోడ్డు పూర్తిగా ధ్వంసం అయిపోయి ఉంటే, ఆ రోడ్డును కూడా నిర్మించాలనే ఆలోచన లేనటువంటి పరిస్థితి. మరి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు, ప్రెగ్నెన్సీ లేడీస్ అత్యవసరంగా వైద్యానికి వెళ్లాలంటే ఈ గుంటల రోడ్లలో పోయేటువంటి పరిస్థితులు లేవు. దయచేసి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లన్నీ నిర్మించాలని మేము జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ స్థానిక నాయకులు అభిషేక్, నరసింహులు, ముత్తుకూరు మండల నాయకులు రహీం, శ్రీహరి, రహమాన్, పవన్, కార్తికేయ, శశి, విష్ణు, తేజ, సుహేల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *