జనసేన పార్టీ ఆవిర్భావ సభ పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో మార్చి 14న జరగబోతున్న సందర్భంలో, చోడవరం నియోజకవర్గ ఇంచార్జి మరియు ఆవిర్భావ సభ పిఠాపురం నియోజకవర్గ సమన్వయకర్త పి.వి.ఎస్.ఎన్. రాజు, పిఠాపురం పార్టీ ఇంచార్జి మర్రెడ్డి శ్రీనివాస్ శనివారం లక్ష్మి నరసాపురం, నరసింగపురం, జములపల్లి, గోకివాడ, బి. కొత్తూరు, తిమ్మాపురం, వెల్దుర్తి, పి. దొంతమూరు గ్రామాల్లో పర్యటించి, పార్టీ నాయకులు, కార్యకర్తలతో సభకు సంబంధించిన ఏర్పాట్ల గురించి చర్చించారు. ఈ పర్యటనలో ఆయా గ్రామాల నాయకులు, వీరమహిళలు, జనసైనికులతో కలిసి ప్రజలకు కరపత్రికలు వ్యక్తిగతంగా అందించి సభకు ఆహ్వానం పలికారు. సభను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తుమ్మపల్లి చందు, వూట నానిబాబు, చక్రధరరావు సహా పలువురు మండల గ్రామ నాయకులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment