బొబ్బిలి జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం మార్చి 14న పిఠాపురంలో జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ సభ “చలో పిఠాపురం” కోసం బొబ్బిలి నియోజకవర్గ సన్నాహక సమావేశం జనసేన పార్టీ ఇంచార్జ్ గిరడ అప్పలస్వామి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో బొబ్బిలి జనసేన నాయకులు పెద్దింటి మనోజ్ కుమార్, బొబ్బిలి మండల అధ్యక్షులు సంచనా గంగాధర్, జనసేన నాయకులు పాండ్రంకి అప్పారావు, ఆడబాల నాగు, మహంతి ధనుంజయ, జమ్ము గణేష్, బూరి రామకృష్ణ, రాగన శింబు, పొట్నూరు రామకృష్ణ, అక్కివరపు ప్రసాద్, మౌళి, గండేటి శ్రీను, పేకెటి సురేష్, వీర మహిళలు రామలక్ష్మి లక్ష్మి, జనసేన కార్యకర్తలు, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొబ్బిలి జనసేన ఇంచార్జ్ అప్పలస్వామి మాట్లాడుతూ, జనసేన పార్టీ ఆవిర్భావ సభకు బొబ్బిలి నుంచి పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. సభకు వెళ్లే వారికి వాహనాల ఏర్పాటు కూడా చేసినట్టు తెలిపారు.
Share this content:
Post Comment