జనసేన పార్టీ ఆవిర్భ దినోత్సవ పోస్టర్‌ ఆవిష్కరణ

జనసేన పార్టీ నగర అధ్యక్షులు తోట సుధీర్ ఆదేశాల మేరకు 21 డివిజన్ అధ్యక్షుడు మండపాక దుర్గాప్రసాద్, ఉపాధ్యక్షులు చిక్కం సూరిబాబు మరియు 21 డివిజన్ కమిటీ నాయకుల ఆధ్వర్యంలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ పోస్టర్‌ను స్థానిక అమ్మవారి గుడిలో ప్రత్యేక ప్రార్థనలు చేసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గౌరవ కాకినాడ సిటీ సమన్వయకర్త పీలా రామకృష్ణ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం నాయకులు ఇంటింటికి వెళ్లి జనసేన పార్టీ కోసం ఓటు వేసి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే, జనసేన పార్టీ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మార్చి 14న జరగబోయే ఆవిర్భావ సభకు హాజరయ్యేలా ప్రత్యేక ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు దుగ్గన బాబ్జి, 20 డివిజన్ అధ్యక్షులు బసవ నాగబాబు, వీరమహిళ దుర్గాశెట్టి, వీర మహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment