అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం జరిగిన ఆవిర్భావ దినోత్సవ సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి, అనకాపల్లి శాసనసభ్యులు గౌరవనీయులు కొణతాల రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా సభలో పాల్గొన్న వీర మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ.. వారిని శాలువాలతో సత్కరించారు. మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి తమ హక్కులను కాపాడుకోవాలని సూచిస్తూ, సభకు హాజరైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, గాజువాక జనసేన పార్టీ ఇంచార్జ్ కోన తాతారావుని చిత్రపటం బహుకరించి శాలువాతో సత్కరించారు. అనంతరం కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ, మార్చి 14న పిఠాపురం, చిత్రాడలో జరగబోయే జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని హోలీ పండుగలా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే బీజేపీతో పొత్తు అవసరమని, కూటమి ప్రభుత్వం వల్ల రాష్ట్ర ప్రయోజనాలతో పాటు దేశ ప్రయోజనాలు కూడా సమర్థవంతంగా ముందుకు వెళతాయని తెలియజేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషికి అభినందనలు తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్‌కు కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొదటి బడ్జెట్‌లో ₹12,500 కోట్లు కేటాయించిన విషయాన్ని ప్రస్తావించారు. అమరావతి అభివృద్ధికి ₹1,500 కోట్లు బడ్జెట్ నుంచి, మరో ₹1,500 కోట్లు ప్రైవేట్ పెట్టుబడిదారుల నుంచి సమీకరించినట్లు వెల్లడించారు. ప్రభుత్వం ఏర్పడిన ఎనిమిది నెలల్లో 3,000 కి.మీ. రహదారులను నిర్మించిందని, గ్రామాల్లో వేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయంటే దానికి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వమే కారణమని వివరించారు. పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ బాధ్యతను స్వయంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకుని చేస్తున్న కృషిని ప్రశంసించారు. నక్కపల్లి ఫార్మా సెజ్‌కు రూ.2 లక్షల కోట్లు, స్టీల్ ప్లాంట్‌ను 7 మిలియన్ టన్నుల కెపాసిటీతో నిర్మించేందుకు కేంద్రం ఆమోదం తెలిపినట్లు తెలియజేశారు. విశాఖపట్నాన్ని ఐటీ సెజ్‌గా అభివృద్ధి చేసేందుకు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు గూగుల్, టీసీఎస్, మైక్రోసాఫ్ట్ వంటి మల్టీనేషనల్ కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు తెలియజేశారు. త్వరలో విశాఖపట్నంలో మెట్రో రైల్ ప్రాజెక్ట్ ప్రారంభం కానుందని చెప్పారు. మే నెల నుండి “తల్లికి వందనం” పథకం కింద అర్హులైన వారికి రూ.15,000, “అన్నదాత సుఖీభవ” పథకం కింద రూ.20,000 మూడుసార్లు ప్రభుత్వం అందించనుందని వివరించారు. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేసేందుకు రిసెప్షన్ కమిటీ, ఫుడ్ కమిటీ, బస్ ఇంచార్జ్‌లను నియమించాలని సూచించారు. మార్చి 13వ తేదీన సాయంత్రం 3 గంటలకు బైక్ ర్యాలీ నిర్వహించాలని, 14వ తేదీన ప్రతి గ్రామం, ప్రతి వార్డులో జనసేన పార్టీ పతాకాన్ని ఎగరవేయాలని పిలుపునిచ్చారు. సభను విజయవంతంగా నిర్వహించి, సురక్షితంగా పాల్గొని తిరిగి వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని సూచిస్తూ, చివరగా జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
Share this content:
Post Comment