గిరిజన ప్రాంతాల్లో జనసేన పార్టీకి పెరుగుతున్న ఆదరణ

  • అల్లూరీ సీతారామరాజు జిల్లా నుంచి జనసేన పార్టీ లో చేరికలు

విశాఖపట్నం దసపల్లా హోటల్లో ఆదివారం అరకు పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్చార్జ్ డా. వంపూరు గంగులయ్య ద్వారా పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో అల్లూరీ సీతారామరాజు జిల్లా నుంచి కిల్లో రంగారావు అలియాస్ రాజన్, మన్యం జిల్లానుంచి నిమ్మక సింహాచలం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అలాగే అతని అనుచరులు జనసేన పార్టీ లో చేరగా వారికి జనసేన పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగ గంగులయ్య మాట్లాడుతూ గిరిజనప్రాంతం నుంచి వివిధ పార్టీల నాయకులు, తటస్తులు, విద్యావంతులు పార్టీలోకి చేరే ఆలోచన చేస్తున్నారని, రోజు రోజుకి జనసేన పార్టీపై ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని అందుకు నిదర్శనమే ఈ చేరికలని అన్నారు. పార్టీలోకి చేరిన నాయకులు రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యముగా పనిచేస్తామని జనసేనపార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలు, ఆశయాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని మేమంతా నిర్ణయించుకున్నామన్నారు. జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ గిరిజనప్రాంతం నుంచి వచ్చిన నాయకులు చైతన్యవంతమైన మార్పు దిశగా ఆలోచన చేసారని, కచ్చితంగా జనసేన పార్టీ సిద్ధాంతాన్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లి ప్రజాదరణ పొందాలని, అన్ని వర్గాల ప్రజలకు జనసేన పార్టీ ప్రభుత్వం ఏర్పాటు ఒక ప్రజాపాలన దృష్ట్యా అత్యంత అవసరమని, రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి, ఉత్తరాంధ్రలో మార్పు వేగంపుంజుకుంటుంది. ఇది గొప్పమార్పుకి చిహ్నమని అలాగే ఈ రోజు పార్టీలో చేరినవారందరికి అభినందనలు తెలియజేస్తున్నామన్నారు.