ప్రమాదకర మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు పెట్టిన జనసేన పార్టీ నాయకులు

రంపచోడవరం: వి.ఆర్.పురం మండలంలోని అన్నవరం వాగు వద్ద కూలిపోయిన బ్రిడ్జి పక్కన నుండి చిన్న వంతెన వేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆ మలుపు అత్యంత ప్రమాదకరంగా ఉంది, రాత్రి వేళల్లో అసలు గమనించలేము. తెలియని వాళ్ళు ఆదమరిస్తే అంతే సంగతులు ఈ కాలం లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి అయితే అక్కడ ఎటువంటి హెచ్చరిక బోర్డును పెట్టలేదు. దానివలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అది గమనించిన జనసేన పార్టీ నాయకులు ముందు జాగ్రత్తగా అక్కడ ఇరువైపులా హెచ్చరిక బోర్డులు పెట్టడం జరిగింది. అలాగే తక్షణమే ప్రభుత్వం ఇలాంటి వాటిపై దృష్టి పెట్టి ముందు జాగ్రత్త గా వ్యవహరించాలని మరియు చింతూరు నుండి వి.ఆర్.పురం మీదుగా బస్ సర్వీస్ నడిపించాలని ములకాల సాయికృష్ణ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ములకాల సాయికృష్ణ, మండల నాయకులు బాగుల అంజనరావు, కెచ్చల పోషిరెడ్డి, శ్రీనివాస్, కళ్యాణ్, పవన్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.