జనసేన పార్టీ యువకులకు అన్ని విధాలుగా అండగా ఉంటుంది

గుంతకల్ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త వాసగిరి మణికంఠని గుంతకల్ పట్టణం సోనియా గాంధీ కాలనీకి చెందిన పలువురు యువకులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించడం జరిగింది. అనంతరం వాసగిరి మణికంఠ మాట్లాడుతూ వైసీపీ సర్కార్ గడిచిన ఐదు సంవత్సరాలలో ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయకుండా నిరుద్యోగులకు తీరని ద్రోహం చేసిందని. ఇలాంటి మోసపూరిత ప్రభుత్వాన్ని గద్దదించేలా రాబోవు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ జనసేన పార్టీ విజయానికి నిస్వార్ధంగా కృషి చేయాలని కోరారు. తద్వారా జనసేన పార్టీ యువకులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని, ముఖ్యంగా అధినేత పవన్ కళ్యాణ్ ప్రతి నియోజకవర్గంలో 500 మంది యువ పారిశ్రామికవేత్తలను తయారు చేయాలని ఉద్దేశంతో వారు ఉపాధి కల్పించేలా మారేందుకు 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ యువకులకు తెలియజేశారు.