త్వరలో జనసేన పార్టీ నిజాయితీగల రాజకీయ శక్తిగా అవతరించనుంది: డా. గంగులయ్య

అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు జనసేన కార్యాలయంలో జరిగిన జనసేన పార్టీ సమావేశానికి వివిధ మండల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్బంగా అరకు పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్చార్జ్ డా. గంగులయ్య మాట్లాడుతూ ప్రస్తుతం రాజకీయాలు గిరిజన యువత క్షుణ్ణంగా గమనిస్తోందని కుల పెద్దలుగా చలామణి అవుతున్న కొందరు చేసే కులరాజకీయలు, అవినీతి అవకాశ, రాజకీయాలు నమ్మేస్తితిలో లేరని యువతకు కావాల్సింది సుస్థిర అభివృద్ధి కానీ ఇలా మాట తప్పి మడమ తిప్పే రాజకీయాలు కాదని అందుకే గిరిజన ప్రజలు జనసేన పార్టీని రోజు రోజు కి ఆదరిస్తున్నారని అన్నారు. రానున్న సమీప భవిష్యత్ లో గొప్ప నిజాయితీ రాజకీయ శక్తిగా జనసేన పార్టీ అవతరించనుందని తెలిపారు. గూడెం మండలం నాయకులు కిల్లో రాజు మాట్లాడుతూ గిరిజన యువతలో మార్పు వస్తోందని, హామీల పేరున ఇచ్చే ప్రతి ఉచిత పథకానికి ప్రజల నిధులే పెట్టుబడిగా పెడుతున్నారు. అది చూసి నమ్మినంతవరకు గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధిని చూడలేమని ఎన్నో వ్యయప్రయసాలకోర్చి చదివించిన తల్లితండ్రులు తమ బిడ్డల భవిష్యత్ కోసం ఒక మంచి రాజకీయవ్యవస్తని ఎంచుకోలేకున్నందుకు ఎంతో బాధపడుతుంటానని తమ కుటుంబాన్ని తామే మార్పు దిశగా ఆలోచన చేసేలా యువత జనసేన పార్టీ సిద్ధాంతాలను తెలియజేయాలని అన్నారు. అలాగే ఈ సందర్బంగా జనసేన పార్టీ సిద్ధాంతాలు ఆశయాలు లక్ష్యాలు నచ్చి చింతపల్లి మండలం, బెన్నవరం పంచాయితీ పరిదిలోని పోతురాజు గుమ్మలు, జీలుగు మెట్ట, గొందీపాకలు పంచాయితి వనం నుంచి యువత శుక్రవారం ఇన్చార్జ్ డా. గంగులయ్య చేతులమీదుగా జనసేన పార్టీ కండువా కప్పుకుని పార్టీలో చేరారు. ఈ చేరికలో ప్రధాన భూమిక పోషించిన కొర్ర భాస్కరరావుకు అభినందిస్తూ చేరిన జర్త సింహాచలం, గోమాంగి ఆనంద్, లోత చంటి, లక్షమన్, సీదారి కొండలరావు, వంతల సూరిబాబు అభినందనలు తెలియజేసారు. ఈ సమావేశంలో పాడేరు మండల అధ్యక్షులు, నందోలిమురళి కృష్ణ, కొర్ర కమల్ హాసన్, అశోక్, సంతోష్, ఈశ్వరరావు, బాబూరావు, బాలకృష్ణ, జి.మాడుగుల మండల అధ్యక్షులు మసాడి భీమన్న, వెంకటరమణ, రాజేష్, చింతపల్లి మండల నాయకులు ఫునిత్, గూడెం నాయకులు కిల్లో రాజు ముర్ల అప్పన్న, లోత నరసింగరావుతదితర జనసైనికులు పాల్గొన్నారు.