తగిన చర్యలు తీసుకునేంతవరకు జనసేన పార్టీ పోరాటం సాగిస్తుంది: రమాదేవి

చిత్తూరు జిల్లా, ఐరాల మండలం, దివిటివారి పల్లి గ్రామంలోని ప్రజలు గ్రామ అభివృద్ధి కోసం దివిటివారిపల్లి డెవలప్మెంట్ ట్రస్ట్ ని ఏర్పాటు చేసి గ్రామ ప్రయోజనాల కోసం మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మించడానికి సర్వే నం. 382, 300 చ.అ. గల స్థలంలో భవనం ఏర్పాటు చేసుకున్నారు. సుమారు ఐదులక్షల ఖర్చు పెట్టి ఆ భవనాన్ని నిర్మించుకున్నారు. ఆగస్టు 30వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3.20 గంటలకు ఎటువంటి నోటీసు జారీ చేయకుండా, జెసిబిని పెట్టి ఆ భవనాన్ని కూల్చివేయడం జరిగింది. ఇదంతా యర్లంపల్లి పంచాయతీ చెందిన వైసిపి ఎంపిటిసి లత భర్త రాజేష్ రెడ్డి చెప్పగా కూల్చాము అని జెసిబి డ్రైవర్ పోలీసుల ముందు చెప్పడం జరిగింది. కూల్చివేసే సమయంలో ఆ భవనానికి ఆనుకొని ఉన్న స్కూల్లో పిల్లలు చదువుకుంటున్నారు, అలాంటి సమయంలో ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఎటువంటి జాగ్రత్తలు పాటించకుండా, భవనాన్ని కూల్చడం వలన పిల్లలకి ఏదైనా ప్రమాదం వాటిల్లి ఉంటే ఎవరు బాధ్యులు? అని సీనియర్ జనసేన నాయకురాలు తంబళ్ళపల్లి రమాదేవి ప్రశ్నించారు. ఆమె సంఘటన జరిగిన స్థలానికి వెళ్లి గ్రామస్తులను కలిసి జరిగిన విధ్వంసం గురించి తెలుసుకోని, సంఘటిత స్థలాన్ని పరిశీలించి, స్థానికుల దగ్గర మరికొన్ని వాస్తవాలు, ఆధారాలు సేకరించిడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వైసిపి ప్రభుత్వం ఆరంభం నుండి ఇలా భవనాలు కూల్చడం పరిపాటిగా మారిందని, ఇలాంటి దుశ్చర్యలను జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం అని ఆమె అన్నారు. పోలీసు వారు ఈ సంఘటనకు సంబంధించి తగిన చర్యలు తీసుకునేంతవరకు జనసేన పార్టీ పోరాటం సాగిస్తుంది అని తంబళ్ళపల్లి రమాదేవి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ చిత్తూరు జిల్లా జనరల్ సెక్రెటరీ తులసి ప్రసాద్, మరియు ఐరాల మండల అధ్యక్షుడు పురుషోత్తం, పూల ప్రభాకర్, చిత్తూరు జిల్లా ప్రోగ్రాం ఆర్గనైజింగ్ సభ్యులు పూల హరిబాబు తదితరులు పాల్గొన్నారు.