ఆనకట్ట నిర్మాణం కొరకు జనసేన కృషి చేస్తుంది: పివిఎస్ఎన్ రాజు

చోడవరం నియోజకవర్గ జనసేన పార్టీ లక్ష్యంలో ప్రధానమైన మంగళాపురం ఆనకట్ట పునర్నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లి శాశ్వతమైన నిర్మాణానికి ప్రభుత్వ అనుమతులు తీసుకువచ్చి చేసి దీనిద్వారా సాగుకు దూరమైన 7000 ఎకరాల పంట భూమికి నీరు అందించడానికి, ఆదివారం జనసేన పార్టీ ఇంచార్జ్ పివిఎస్ఎన్ రాజు ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ నాయకులు, స్థానిక గ్రామాల రైతులు ఆనకట్ట ఆవరణను సందర్శించారు. ఆనకట్ట ప్రాంతంలో ఉన్న పరిస్థితులను పరిశీలించగా అక్కడ నీరు వృధాగా పోవడంతో పాటు ఎడమ కాలువ వైవు భూమి చాలావరకు కోతకు గురికావడం జరిగింది. స్థానికంగా ఉన్న రైతులు మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాలు నుండి ఈ ఆనకట్ట ద్వారా రావలసిన నీరు కుడికాలు నుండి ఎడమ కాలువ నుండి రాకపోవడం వలన దీనిపై ఆధారపడి ఉన్న పది గ్రామాలకు చెందిన 7000 ఎకరాల సాగుభూమి నిరుపయోగం అయిందని, తమ జీవనోపాధి పూర్తిగా దెబ్బతిని పేదరికంలోకి వెళ్లిపోయామని అలాగే భూగర్భ జనాలు అడుగంటి పోవడం వల్ల త్రాగునీటికి కూడా ఇబ్బంది కలుగుతుందని అన్నారు. ప్రస్తుతం నీటిపారుదల శాఖ అధికారులు తాత్కాలికంగా చేస్తున్న మరమ్మత్తుల వలన ఉపయోగం లేదని ఇది శాశ్వత పరిష్కారం కాదని శాశ్వత నిర్మాణం చేయాలని రైతులు అన్నారు. ఈ సమస్యకి పరిష్కారం చూపించే విధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి ఈ ఆనకట్ట నిర్మించి తమ జీవితాలకు భరోసా కల్పించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పివిఎస్ఎన్ రాజు మాట్లాడుతూ ఈ విషయంలో గత ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చామని కానీ అప్పుడు ఉన్న ప్రభుత్వం స్పందించలేదని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో అధికారి భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ చిత్తశుద్ధితో తన ప్రయత్నాన్ని చేస్తుందని ఇప్పటికే జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుని కలిసి దీనికి సంబంధించి వినతిపత్రాన్ని అందజేశామని అది సంబంధిత అధికారుల వద్ద పరిశీలనలో ఉందని, నేటి సందర్శన విషయాలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి తెలియజేసి వారి ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు దృష్టికి తీసుకువెళ్లి ఈ సమస్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఆనకట్టను నిర్మాణం చేసి రైతులను ఆదుకుంటామని అన్నారు. చోడవరం నియోజకవర్గ జనసేన పార్టీ లక్ష్యంలో అత్యంత ప్రధానమైన విషయం ఈ ఆనకట్ట నిర్మాణమని అన్నారు. రైతుల పక్షాన జనసేన పార్టీ ఉంటుందని రైతు బాగుంటేనే సమాజానికి మంచి జరుగుతుందని రైతులు కష్టాల్లో మునిగిపోతే సమాజ మనుగడికి నష్టం కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు డిఎస్ నాయుడు, మైచర్ల నాయుడు, బలిజ మహారాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లం రామ అప్పారావు, కర్రి రమేష్, సీనియర్ నాయకులు కర్రి తమ్మి నాయుడు, అనకట్ట చైర్మన్ కర్రి రాజారావు, శనివాడ నాయుడు బాబు, తుమ్మపాల రమేష్, కసింకోట మాణిక్యం, దొండా సాయి, బాలకృష్ణ, బొబ్బిలి నాయుడు చింతల కిషోర్, సోమిరెడ్డి శివశంకర్, స్థానిక రైతులు పాల్గొన్నారు.

WhatsApp-Image-2025-02-17-at-12.13.12-PM-1024x768 ఆనకట్ట నిర్మాణం కొరకు జనసేన కృషి చేస్తుంది: పివిఎస్ఎన్ రాజు

Share this content:

Post Comment