జనసేన పార్టీ బలోపేతమే మా లక్ష్యం అంటున్న అవనిగడ్డ జనసైనికులు

అవనిగడ్డ, ఇప్పటికే అవనిగడ్డ నియోజకవర్గంలోని 6 మండలాలకు మండల కమిటీలు, అవనిగడ్డ మండలంలోని 10 పంచాయతీలకు గ్రామ పార్టీ అధ్యక్షుల నియామకాలు, మోదుమూడి గ్రామంకు గ్రామ పార్టీ కమిటీ పూర్తి కాగా, శుక్రవారం అవనిగడ్డలోని మండల పార్టీ కార్యాలయంలో అశ్వారావుపాలెం, దక్షిణ చిరువోలులంక, రామకోటిపురం, తుంగలవారిపాలెం, వేకనూరు గ్రామాలకు గ్రామ పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో గ్రామ పార్టీ కమిటీలను ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గుడివాక శేషుబాబు, జిల్లా పార్టీ అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాలరావు, గ్రామ పార్టీ అధ్యక్షులు దాసినేని నాగరాజు, కమ్మిలి వేణుగోపాలరావు, భూపతి బాల రేణుకయ్య, చుండూరు రమేష్, తుంగల వేణు, ఎంపీటీసీ కటికల వసంత్, బచ్చు శ్రీహరి, తుంగల నరేష్, కమ్మిలి సాయిభార్గవ, కమతం నరేష్, బొప్పన పృధ్వీ, బచ్చు మురళి, మత్తి అజయ్, వరికూటి బాల వెంకటేశ్వరరావు, దాసినేని శివ, అప్పికట్ల శ్రీ భాస్కర్, యక్కటి రంగనాథ్, కోసూరి అవినాష్ తదితరులు పాల్గొన్నారు.