విక్రమ సింహపురి యూనివర్శిటీ వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ అల్లం శ్రీనివాసరావుకి జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్ బొబ్బేపల్లి సురేష్ నాయుడు వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలలో గవర్నర్, ముఖ్యమంత్రి చిత్రాలతోపాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు వీసీ, రిజిస్ట్రార్ ఛాంబర్లలో గౌరవంగా పొందుపరిచిన నేపథ్యంలో, నెల్లూరులోని విక్రమ సింహపురి యూనివర్శిటీలో మాత్రం ఇప్పటికీ ఆయన ఫోటో లేకపోవడం దురదృష్టకరమని తెలిపారు. పవన్ కళ్యాణ్ గారి చొరవతోనే 2017లో యూనివర్శిటీ అద్దె భవనాల నుంచి ప్రస్తుత కాకుటూరులోని స్థిర భవనాలకు తరలించబడిందని, ఆయనకు నెల్లూరుతో ఆత్మీయమైన బంధం ఉన్నదని గుర్తు చేశారు. రాష్ట్రంలోని ఇతర ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో పవన్ కళ్యాణ్ గారి చిత్ర పటాలు గౌరవంగా ఉండగా, నెల్లూరులో మాత్రం అజ్ఞాతంగా మిగిలిపోవడం ఆయన అభిమానుల మనసును బాధించేదిగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్, సీఎం ఫోటోలతోపాటు పవన్ కళ్యాణ్ గారి చిత్రాన్ని కూడా వీసీ, రిజిస్ట్రార్ ఛాంబర్లలో పొందుపరచాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment