విజయవాడ, విశిష్ట నటనతో ప్రేక్షక హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహనీయుడు ఎస్వీ రంగారావు జయంతిని జనసేన పార్టీ ఘనంగా జరిపింది. పార్టీ నాయకురాలు తిరుపతి అనూష ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గంలో జయంతి వేడుకలు జరుగగా, ఆయన చిత్రపటానికి జనసైనికులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అనూష మాట్లాడుతూ, ‘‘మాయాబజార్‌లో ఘటోత్కచుడు, నర్తనశాలలో కీచకుడు, భక్త ప్రహ్లాదలో హిరణ్యకశిపుడు పాత్రలతో తెలుగు నటనకు దిక్సూచి అయ్యారు ఎస్వీ రంగారావు. ఆయన నటన, తెలుగు సాహిత్యం, నాటక రంగానికి చేసిన సేవలు స్మరణీయంగా ఉంటాయి’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ విజయవాడ ప్రచార కమిటీ కోఆర్డినేటర్ తిరుపతి సురేష్, ఐటీ కోఆర్డినేటర్ మంతాపురం రాజేష్, డివిజన్ నాయకులు శ్యాంసుందర్, ఆదిత్య రెడ్డి, అర్జా మార్కండేయులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఇలాంటి వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు.
Share this content:
Post Comment