మదనపల్లి: ప్రజా నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారి జయంతిని పురస్కరించుకుని మదనపల్లి కృష్ణదేవరాయల కూడలిలో జనసేన పార్టీ నాయకులు శ్రీరామ రామాంజనేయులు పూలమాలలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “వంగవీటి రంగా గారు బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల కొరకు నిస్వార్థంగా పోరాడిన మహానేత. ఆయన రాజకీయాల్లో పన్నిన ధైర్యపు బాటలు, ప్రజా పోరాటాల్లో చూపిన స్ఫూర్తి చిరస్మరణీయమవుతాయి” అని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయ కుమార్, అమర్ నారాయణ, లీలాకర్, జగదీష్, కుమార్, విజయకట్ట తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment