శ్రీకాకుళం నుంచి ఆమదాలవలస రోడ్ల మరమ్మత్తు కోసం జనసేన నిరసన దీక్ష

శ్రీకాకుళం నుంచి ఆమదాలవలస రోడ్ల మరమ్మత్తు కోసం జనసేన నిరసన దీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీకాకుళం నియోజకవర్గ జనసేన నాయకులు ఉదయ్ శంకర్ మాట్లాడుతూ ఏళ్ళతరబడి రాజకీయలో ఉద్దనపండితులుగా ఉన్న వైస్సార్సీపీ నాయుకులకి ఈ రహదారిలో ప్రయాణించడానికి ప్రజలు ఎంత ఆవేదన పడుతున్నారో అనేది కనపడటంలేదా? ఇంకా ఎన్నాళ్ళు ఏప్రిల్ ఫూల్ చేస్తారు? రెండు నియోజకవర్గాలకు ప్రధాన రహదారి, నిత్యం రాకపోకలతో రద్దీ, సుదూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళకి అందుబాటులో ప్రధాన రైల్వే స్టేషన్, నిత్యము వ్యాపార రాకపోకలు, వైద్యం కోసం జెమ్స్ హాస్పిటల్ ఇలా ఎన్నో వాటితో నిరంతరం రద్దీగా ఉండే రహదారి. పాలకులు మారుతున్నా రోడ్ దుస్థితి మారదు, ప్రతి వారం ఏక్సిడెంట్, ఏడాదికి 20 పైన మరణాలు సంభవించినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికారులు మరియు ప్రభుత్వం. రాష్ట్ర ప్రజా శ్రేయస్సు కోసం ప్రజా పక్షంలో జనసేన అధినేత రోడ్ల సమస్య గుర్తు చేయడం జరిగింది. అప్పటి నుంచీ నాయకులు అధికారులు టెండర్ టెండర్ అని వివరణలు ఇవ్వటం తప్ప ఫలితం శూన్యం. రోడ్ ప్రమాదంలో క్షతగాత్రులు మీరు మీ కుటుంబ సభ్యులు అయితే అప్పుడూ స్పందిస్తారా అని ఉదయ్ శంకర్ ప్రశ్నించారు. బమ్మిడి సిద్ధూ మాట్లాడుతూ శ్రీకాకుళం ఆమదాలవలస ప్రధాన రహదారి సమస్య పరిష్కారం పేరుతో 4ఏళ్లుగా ఇరు నియోజకవర్గ ప్రజలను ఏప్రిల్ ఫూల్ చేయడం మానుకోవాలని హితవు పలికారు శ్రీకాకుళం జనసేన నాయకులు జనసేన అధ్యక్షుల స్ఫూర్తితో గతంలో కూడా ఇదే ఆంధ్రప్రదేశ్ రోడ్ల పరిస్థితిపై ప్రభుత్వ అధికారులు & ప్రభుత్వానికి చూపించడం జరిగింది. సమస్యపై పవన్ కళ్యాణ్ గళం ఎత్తిన ప్రతిసారీ నేటి ప్రభుత్వం తుతు మంత్రంగా చర్యలు తీసుకుంటున్నట్టు సోషల్ మీడియా ప్రచారాలు, కొందరు వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ తప్ప నేటికీ ఏక్కడ ఎలాంటి కార్యాచరణ లేదు. ముఖ్యంగా ఇద్దరు మంత్రులు & ఒక స్పీకర్ ఉన్న శ్రీకాకుళం జిల్లాలో రెండు నియోజకవర్గాలకు ఇద్దరు సీనియర్ మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధాన రహదారి అయిన శ్రీకాకుళం ఆమదాలవలస ప్రధాన రహదారి ఇప్పటికి దయనీయ స్థితిలో ఉంది. 4ఏళ్లుగా ఎన్నో ఏక్సిడెంట్లు, ఎందరో మృత్యు ఒడిలోకి చేరినా ఈ నాయకులు ప్రజా సమయాలను కనీసం పట్టించుకోవడం లేదు. శ్రీకాకుళం ఆమదాలవలస ప్రధాన రహదారిలో ప్రముఖ హాస్పిటల్ అయిన జెమ్స్, ఎన్నో విద్యాసంస్థలు, కర్మాగారాలు దారి ఇంతటి దయనీయ స్థితిలో ఉండడం చాలా బాధాకరం. ఇప్పటికైనా ఓట్లు వేసి గెలిపించిన ప్రజల కన్నీరు తుడవాలి అని శ్రీకాకుళం జనసేన నాయకులు బమ్మిడి సిద్దు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో నియోజవర్గ నాయకులు కామేష్, మధు, జాడ సాయి, తేజ, తిర్ణధ, సతీష్, సంతోష్, రాంబాబు, రాజు, కొర్ల్లయ, పాల్గ పాలకొండ నియోజకవర్గ జనసేన జానీ పాల్గొన్నారు.