కళ్ళకు నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసన వ్యక్తం చేసిన జనసేన

గంగాధర నెల్లూరు, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అక్రమ అరెస్టును, వారితోపాటు ఉన్న నాయకుల అక్రమ అరెస్టులను జనసేన పార్టీ గంగాధర నెల్లూరు నియోజకవర్గం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శోభన్ బాబు, ఉపాధ్యక్షులు విజయ్, కార్వేటి నగరం మండల బూత్ కన్వీనర్ సురేష్ రెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, జిల్లా కార్యక్రమ కమిటీ సభ్యులు భానుచంద్రారెడ్డి, నియోజకవర్గ యువజన ప్రధాన కార్యదర్శి వెంకటేష్, కార్వేటి నగరం టౌన్ కమిటీ అధ్యక్షులు రాజేష్, ఉపాధ్యక్షుడు టౌన్ కమిటీ ప్రధాన కార్యదర్శి మహేంద్ర, కార్వేటినగరం మండల ప్రధాన కార్యదర్శి ప్రతాప్, టౌన్ కమిటీ నాయకులు చంద్ర, నియోజకవర్గ ఇంచార్జి సతీమణి స్రవంతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.