దామలచెరువు పంచాయతీ రోడ్లు మరియు డ్రైనేజీ దుస్థితిపై జనసేన నిరసన

చంద్రగిరి, చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ ఆదేశాలమేరకు చంద్రగిరి నియోజకవర్గం దామలచెరువు పంచాయతీలో డ్రైనేజీ కాలువలు మరియు సిమెంట్ రోడ్డుల్ని నిర్మించాలని స్థానిక ప్రజలతో మరియు రాష్ట్ర, జిల్లా, మండల నాయకులతో కలిసి నిరసన తెలియజేయడం జరిగింది. దామలచెరువు పంచాయితీ కార్యదర్శి ఢిల్లీ బాబుని కలిసి రెప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. పంచాయితీ కార్యదర్శి సమస్యమీద సానుకూలంగా స్పందించి త్వరితగతిన పనులు చేస్తామని హామీ ఇచ్చారు. చేయని పక్షాన జనసేన పార్టీ రిలే దీక్షకు సిద్ధమని తెలియచేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆకెపాటి సుభాషిణి, చంద్రగిరి జనసేన పార్టీ ఇంచార్జ్ దేవర మనోహర, చంద్రగిరి జనసేన నాయకులు నాసీర్, జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.