జగన్ విస్మరించిన 100 హామీల ప్లకార్డుల ప్రదర్శనతో జనసేన నిరసన..

  • మాట తప్పావు మడం మడమ తిప్పావు..దిగిపో జగన్ అంటూ.. తప్పిన 100 మాటలు ప్లకార్డులతో జనసేన పార్టీ నెల్లూరు లో నిరసన
  • మూడు దగ్గరే ఆగిపోయి రాష్ట్ర అభివృద్ధిని గాలికొదిలేసారు జగన్

నెల్లూరు: జనసేన పార్టీ నెల్లూరు నాయకులు గునుకుల కిషోర్ ఆధ్వర్యంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ను విమర్శించడంపై శనివారం గాంధీ బొమ్మ సెంటర్ నందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చి మరచిపోయిన జగన్ తప్పిన మాటల ప్లక్కార్డులను 100కు పైగా ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మాట తప్పడం మడం తిప్పడం అలవాటైపోయిన జగన్ దాదాపు 100 మాటలు పైగా నిలబెట్టుకోలేకపోయాడు, రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలి మూడు పెళ్లిళ్ల దగ్గర ఆగిపోయిన అతని కుటుంబంలో, ఎవరెవరికి ఎన్ని పెళ్లిళ్లు జరిగాయో మాకు తెలుసు సంస్కారహీనంగా మాట్లాడటం మా నాయకులకు తెలియదు అందుకే సహనం వహిస్తున్నారని తెలిపారు, ప్రజల మద్దతు లేకుండా ఈసారి 175 అని కలలు కంటున్న మీకు 50 సీట్లు దక్కడం కూడా కష్టమే అని తెలిపారు, ఎన్నికల ముందు అవ్వా,తాతా,అక్కా,అన్నా అంటూ ఊరూరు తిరిగిన జగన్ గెలిచిన తర్వాత ప్రజల్లో కనపడటమే కష్టం అయిపోయింది, ఎక్కువ సీట్లు గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెప్పిస్తానన్న జగన్ ఇప్పటికి రాజధాని కూడా ఏర్పరచలేకపోయారు, సంస్కారహీనంగా వ్యక్తిగతంగా దుర్భాషలాడుతున్న జగన్ కి రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారు, మాట తప్పావ్ మడం తిప్పావ్ దిగిపో జగన్..అంటూ విద్యార్థులకు స్కాలర్షిప్పుల్లేవు, యువతకు ఉద్యోగ అవకాశాల్లేవ్, ఉద్యోగస్తులకు జీతాల్లేవ్, కొత్త పరిశ్రమలకు రాయితీల్లేవ్, వృద్ధులకు వైద్య సౌకర్యాలు లేవు, అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందాలన్నా రాష్ట్ర అభివృద్ధి చెందాలన్నా జనసేన పార్టీ గాజుగ్లాసు కి ఓటు వేసి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులకు గునుకుల కిషోర్ తో పాటుకంథర్, హేమంత్, షాజహాన్, ఇంతియాజ్, రాజా, మౌనేష్, బాలు, వర, వెంకీ, వినోద్, శ్రీకాంత్, బన్నీ, శంకర్, మల్లీ తదితరులు పాల్గొన్నారు.