మెరిట్ ప్రాతిపదికన పోస్టులు భర్తీ చేపట్టాలని జనసేన వినతి

నెల్లిమర్ల నియోజకవర్గంలో అంగన్వాడీ కార్యకర్తల నియామకాలలో ఉన్నత చదువు పూర్తి చేసి మెరిట్ ప్రాతిపదికన పోస్టులు భర్తీ చేపట్టాలని జనసేన పార్టీ తరపున జిల్లా ఐసిడిఎస్ పిడికి విజ్ఞాపనపత్రం అందజేశారు. జనసేన నాయకులు మాట్లాడుతూ పోస్టులు భర్తీ చేసేందుకు ఇచ్చిన నోటిఫికేషనులో పొందుపరిచిన సూచనల అనుగుణంగా నియామక ప్రక్రియ జరగాలని, రాజకీయ ప్రలోభాలకు లోబడి చేతివాటం చూపిస్తే జనసేన పార్టీ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పూసపాటిరేగ మండల అధ్యక్షుడు జలపారి అప్పడుదొర(శివ), భోగాపురం మండల అధ్యక్షులు వందనాల రమణ, వీరమహిళలు బాసి దుర్గమ్మ, అట్టాడ ప్రమీల, సీనియర్ నాయకులు బాసి పైడిరాజు, అల్లాడ జగదీష్ తదితర జనసైనికులు పాల్గొన్నారు.