జనసైనికుడు రామాజీ కుటుంబానికి జనసేన అండ

పిఠాపురం నియోజకవర్గం, రాపర్తి గ్రామానికి చెందిన జనసైనికుడు వంగలపూడి రామాజీ ఇటీవల యాక్సిడెంట్ కు గురై చనిపోవడం జరిగింది. విషయం తెలుసుకొన్న జనసేన నాయకులు వెన్నా జగదీష్, పిల్లా శ్రీధర్ గురువారం రాపర్తి గ్రామంలో ఉన్న వారి ఇంటికి వెళ్లి ఆ కుటుంబ సభ్యులకు తగిన ఓదార్పునిచ్చి.. కేసు విషయంలో మరియు ఇన్సూరెన్స్ విషయంలో అన్న విధాలుగా సహాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వెన్నా జగదీష్ ఆ కుటుంబ సభ్యులకు ఒక 5,000/ ఆర్ధిక సహాయం చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్య సూర్నీడి, దువ్వా వీరబాబు, కట్టా బంగార్రాజు, కత్తిపూడి బాబ్జీ, పిల్లా శివశంకర్, కె.కె.రాజు, బుర్రా సూర్యప్రకాష్, గంజి గోవిందరాజు, వాకపల్లి సూర్యప్రకాష్, అడపా శివరామకృష్ణ, పెనుపోతుల చక్రి మరియు జనసైనికులు పాల్గొన్నారు.