నకరికల్లులో కొనసాగుతున్న జనసేన పోరాటం..!

  • 2వ రోజుకి చేరిన తాడువాయి లక్ష్మీ ఆమరణ నిరాహార దీక్ష..!
  • శిబిరాన్ని సందర్శించిన బొర్రా, కొమ్మిశెట్టి

సత్తెనపల్లి నియోజకవర్గం, మండల కేంద్రమైన నకరికల్లు గ్రామంలోని ప్రధాన రహదారి నిర్మాణం విషయమై మంత్రి అంబటి రాంబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకుని తక్షణమే పనులు ప్రారంభించాలంటూ గురువారం నుండి జనసేపార్టీ నకరికల్లు మండలాధ్యక్షురాలు తాడువాయి లక్ష్మీ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష శుక్రవారం రెండవ రోజుకు చేరింది. ఈ సందర్భంగా శుక్రవారం దీక్షా శిబిరాన్ని సత్తెనపల్లి నియోజకవర్గ జనసేనపార్టీ నాయకులు బొర్రా వెంకట అప్పారావు, ఉమ్మడి జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి వెంకట సాంబశివరావు తదితరులు సందర్శించి లక్షీకి సంఘీభావాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇచ్చిన హామీని నిలబెట్టుకోని నాయకుల చొక్కా పట్టుకుని నిలదీయాలన్న జగన్ రెడ్డి మాటల్ని అంబటికి గుర్తు చేశారు. చెత్త పన్ను, రోడ్డు పన్నులు కట్టించుకునే ప్రభుత్వం కనీసం ఇచ్చిన మాట ప్రకారం కార్యాచరణ మొదలుపెట్టక పోవడం దురదృష్టకరం. తక్షణమే సమస్యపై స్పందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాదెండ్ల నాగేశ్వరరావు, చిలకా పూర్ణా, నామాల పుష్పలత, కడియం అంకమ్మరావు తదితరులు పాల్గొన్నారు.

శిబిరాన్ని సందర్శించిన గురజాల జనసేన నేతలు:
మంత్రి అంబటి రాంబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకుని తక్షణమే పనులు ప్రారంభించాలంటూ గురువారం నుండి జనసేపార్టీ నకరికల్లు మండలాధ్యక్షురాలు తాడువాయి లక్ష్మీ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష శుక్రవారం జనసేన జిల్లా కార్యదర్శి కటికం అంకారావు, సంయుక్త కార్యదర్శి దూదేకుల ఖాశిం, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు సలీం, మణి, ముక్కంటి తదితరులు పాల్గొని తమ సంఘీభావాన్ని తెలిపారు.

బొర్రా వెంకట అప్పారావు అధ్వర్యంలో పవనన్న ప్రజాబాట

సత్తెనపల్లి, సతైనపల్లి పట్టణంలోని 19 వార్డు ఏరియాలైన సుందరయ్య కాలనీ, ఎస్.సి.కాలనీలలో జనసేన పార్టీ నాయకులు బొర్రా వెంకట అప్పారావు అధ్వర్యంలో పవనన్న ప్రజాబాట కార్యక్రమాన్ని నేడు సాయంత్రం నిర్వహించడం జరిగింది. జనసేన పార్టీ సిద్ధాంతాలను గడపగడపకు వివరిస్తూ ఈ కార్యక్రమం నేడు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన ముఖ్య నాయకులు బొర్రా వెంకట అప్పారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి వెంకట సాంబశివరావు, నామాల పుష్పలత, దార్ల శ్రీనివాస్, రామిశెట్టి శ్రీనివాస్, చింతల వెంకట్, నరేంద్ర, ముందు శ్రీనివాసరావు, అదే విధంగా శిరిగిరి పవన్ కుమార్, నాదెండ్ల నాగేశ్వరరావు, చిలకా పూర్ణ తదితరులు పాల్గొన్నారు.

బత్తుల శివని పరామర్శించిన బొర్రా వెంకట అప్పారావు

సత్తెనపల్లి, రెంటపాల గ్రామానికి చెందిన జనసైనికుడు బత్తుల శివకి ఇటీవల యాక్సిడెంట్ జరగడం జరిగింది. ఈ విషయాన్ని గమనించిన సత్తెనపల్లి నియోజకవర్గ నాయకులు బొర్రా వెంకట అప్పారావు శుక్రవారం ఆస్పత్రికి వెళ్లి అతనిని పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా తన వంతుగా ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రెంటపాల గ్రామ అధ్యక్షుడు శ్రీనివాసరావు రామ సైదులు కట్టెకోట శ్రీనివాసరావు మరియు బీసీ నాయకులు, మండల అధ్యక్షుడు, రూరల్ మండలం నాయకులు పాల్గొనడం జరిగింది.