ప్రజా సమస్యలపై జనసేన పోరుబాట పాదయాత్ర

ఏలూరు నియోజకవర్గం: ప్రజా సమస్యలపై జనసేన పోరుబాట పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా రెండవ డివిజన్ రామా నగర్ కాలనీలో 2వ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో పర్యటించిన రెడ్డి అప్పలనాయుడుకు ప్రజానీకం ఘనస్వాగతం పలికింది. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ఈ డివిజన్లోని ప్రజల వద్ద నుండి విశేష స్పందన వస్తుందని, ఇక్కడ సమస్యల వలయం ముంచుకొస్తున్నాయి.. పైపుల్లోను ఎక్కడ చూసినా మురికి నీరు వస్తుంది. ఈ నీరు తాగడానికి కాదు కదా ముఖం కడుక్కోవడానికి కూడా పనికిరాకుండా ఉందంటూ ఇక్కడి ప్రజలు విలపిస్తున్నారు.. ఏమి అవగాహన లేని ప్రభుత్వం ఇది.. కరెంట్ బిల్లు సాకు చెప్పి అరకొర ఇస్తున్న సంక్షేమ పథకాన్ని సైతం పీకేస్తున్నారు. 5 న్నర కోట్ల ఆంధ్రుల సొంత ఆస్తులు ఏమవుతున్నాయో అనే ఆందోళనలో ప్రజలు ఉన్నారు.. ఈ లూటీ దారు, దగా కోరు ముఖ్యమంత్రి ప్రజల ఆస్తులను సైతం కొల్లగొట్టి తాకట్టు పెట్టేలా ఉన్నారని విమర్శించారు.. రాష్ట్రంలో ఉన్న 30,000 మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డు మీద పడ్డారు. తమ సొంత ఇంటిని అమ్ముకోవాలి లేదా ఎక్కడైనా కొనుక్కోవాలి తెలియని స్థితిలో ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని అట్టడుగుకి తీసుకొచ్చిన ముఖ్యమంత్రి, దొంగ ముఖ్యమంత్రిగా రికార్డును సృష్టిస్తాడని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఏలూరు ఎమ్మెల్యే ఈ డివిజన్ లో మురుగునీరు వస్తుందన్నా నీరు సరఫరా లేదన్నా ఎక్కడా జాడలేని ఆళ్ళనాని.. మీకు ప్రజలంటే భయమా..? ప్రజల ఓట్లతో గెలిచిన మీరు ప్రజా సమస్యల్ని గాలి కొదిలేసి వాటిని పట్టించుకోకుండా పారిపోతున్నారు. మొన్ననే ఏలూరుకి వారాహి యాత్ర వస్తుంది అంటే 300 కోట్లు శాంక్షన్ చేశారు. ఆ 300 కోట్లు ఏమయ్యాయి? మున్సిపల్ కార్పొరేషన్ కి వచ్చే వందలాది కోట్లు ఆదాయం ఎక్కడికి పోతుంది. ఏలూరులో ఏ డివిజన్ లో చూసిన ఉన్న గోతులను పూడ్చలేదు. వీధిలైట్లను వెలిగించలేదు. మంచినీటి సరఫరా లేదు. సానిటరీ లేదు. పైగా చెత్త ఐడియాతో చెత్త పన్నులు వేసి ప్రజలను పీడిస్తున్నారు. ఈ అన్నింటికీ సమాధానం చెప్పాల్సిన లోకల్ ఎమ్మెల్యే బాధ్యత మీ పైన ఉందని గుర్తు చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ నిధులు గోల్మాల్ అవుతున్నాయి. ఏ రకంగా ఖర్చు చేస్తున్నారో తెలీదు. ఇప్పటికైనా ఒక ప్రజా ప్రతినిధిగా ప్రజలకు సమాధానం చెప్పాలని, అలాగే చెంచుల కాలనీ, మస్తాన్ మన్యం కాలనీలోని సమస్యలను సైతం గాలి కొదిలేసి మౌలిక వసతులు అయిన సౌకర్యాలు లేవని, అప్పుడప్పుడు డప్పులతో ఊరేగడం భావ్యం కాదని, గడపగడపకు మన ప్రభుత్వం అని చెప్పి మీ నాయకులతో సన్మానాలు పొగడ్తలు చేయించుకోవడం మానేసి ప్రజా సమస్యలన్నీ పట్టించుకోవాలని ఈ విధంగా జనసేన పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ శిరిపల్లి ప్రసాద్, జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, కావూరి వాణిశ్రీ, ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దోసపర్తి రాజు, స్థానిక నాయకులు కందుకూరి ఈశ్వరరావు, కొల్లాటి శివకుమార్, బ్రదర్ ప్రసాద్, బావిశెట్టి శ్రీనివాసరావు, భేతా ప్రసాద్, కొడిసి శివ, పులపా రామకృష్ణ, విజయ్, బాలు, బాల భాస్కర్, వీరమహిళలు జొన్నలగడ్డ సుజాత, సరళ, కోల సుజాత, తుమ్మపాల ఉమా దుర్గ, ప్రమీల రాణి, బీబీ, నాయకులు అల్లు సాయి చరణ్, వీరంకి పండు, రెడ్డి గౌరీ శంకర్, బోండా రాము నాయుడు, బుధ్ధా నాగేశ్వరరావు, పైడి లక్ష్మణరావు, బొత్స మధు, ఎట్రించి ధర్మేంద్ర, వల్లూరి రమేష్, చిత్తిరి శివ, కోల శివ, కీర్తి కృష్ణ, పవన్, సురేష్, గోపి, హరీష్ బీజేపీ మిత్రపక్షాల నాయకులు ఎట్రించి ముఖేష్, పల్లంట్ల బాలు, దొడ్ల శ్రీనివాసరావు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.