లారీ ఓనర్లు, డ్రైవర్ల సమస్యలపై జనసేన పొరాడుతుంది: ముత్తా శశిధర్

కాకినాడ సిటిలోని లారీ ఓనర్స్ & డ్రైవర్స్ శుక్రవారం జనసేన పార్టీ కాకినాడ సిటి ఇంచార్జ్ & పి.ఏ.సి సభ్యులు ముత్తా శశిధర్ ను కలిసి తమ సమస్యలపై వినతిపత్రం సమర్పించి మద్దతు కోరారు. ఈ సందర్బంగా వీరి సమస్యలపై స్పందిస్తూ ముత్తా శశిధర్ మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం అన్ని వర్గాలనీ చంపేస్తూ ఎవరినీ బతకనీయని స్థితులని కలగచేస్తోంది. ప్రతి మనిషి మీదా వ్యపారం చేసే స్థాయికి దిగజారిపోయింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలపై వ్యాపారం చేయడానికే అధికారంలోకి వచ్చారు అన్నారు. నేటి లారీ ఓనర్స్ & ద్రైవర్స్ పట్ల ఈ వై.సి.పి ప్రభుత్వ ధోరణి చూస్తుంటే పాత సామెతలోలాగ రేవు దాటే ముందు ఓడ మల్లన్న, ఒడ్డు చేరాకా బోడి మల్లన్న అన్నట్టు ప్రవర్తించడం చాలా అమానుషం అన్నారు. కరోనా సమయంలో ప్రజల కోసం ప్రాణాలకు తెగించి ముందుకువచ్చిన వీరిని వీరి సేవలని ఆసాంతం వాడుకుని “వారియర్స్” అని కితాబులిచ్చి, సమ్మానించి అవసరం తీరిపోయాకా వీరి నెత్తిమీద పన్నుల రూపంలో గుదిబండలు వేస్తోందన్నారు. గతంలో ఉన్నటువంటి గ్రీన్ టాక్స్ నేడు కొన్ని పదుల రెంట్లు పెంచి వీరి రక్తాన్ని పిండేస్తున్నారనీ, అసలే ఒకవైపు డీజిల్, పెట్రోల్ రేట్లు పక్క రాష్ట్రాలకన్నా చాలా ఎక్కువ ధరలు వసూలు చేస్తున్న ఈ వై.సి.పి ప్రభుత్వం ఈ వర్గాన్ని గతిలేక ఆత్మహత్యలు చేసుకునేలా చేస్తుంటే జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదన్నారు. తమ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు తనదృష్టికి వచ్చిన సమస్యలపై పోరాటం చేసి పరిష్కారం సాధించారని, త్వరలో పి.ఏ.సి సభ్యుడిగా తాను తమ నాయకులు నాగేంద్ర బాబు గారు, నాదెండ్ల మనోహర్ గారి ద్వారా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వీరి సమస్యలని తెచ్చి, ఈ సమస్యపై చర్చించి, వీరికి మద్దతుగా పోరాటం చేస్తామని తెలియచేసారు. అనంతరం జనసేన పార్టీ కాకినాడ సిటి అధ్యక్ష్యుడు సంగిసెట్టి అశోక్, రాష్ట్ర సమ్యుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ, జిల్లా సెక్రెటరీ అట్ల సత్యనారాయణ, సిటీ ఉపాధ్యక్షులు అడబాల సత్యనారాయణ, సిటీ కార్యదర్శి కుచర్లపాటీ అర్జున్ రాజు, వార్డు అధ్యక్షులు ఆకుల శీను శ్రీమన్నారాయణ మనోహర్ గుప్తా, జాడ రాజు, లారీ ఓనర్స్ వాసు, గంగాధర్, నాగేశ్వరరావు, నాగేంద్ర, దుర్గాప్రసాద్, మరియు జనసైనికులు ఆర్.టి.ఓ అధికారులకి వీరి సమస్యల పరిష్కారం కోరుతూ వినతిపత్రాన్ని సమర్పించారు.