జనసేన-టీడీపి పొత్తు రాష్ట్ర భవిష్యత్తు కోసమే: అక్కల రామ్మోహన్

మైలవరం: స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో బుధవారం జనసేన మరియు తెలుగుదేశం పార్టీల ఉమ్మడి మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశంలో పాల్గొన్న జనసేన మరియు తెలుగుదేశం పార్టీల ఇంచార్జ్ లు అక్కల రామ్మోహన్ రావు(గాంధీ)మరియు దేవినేని ఉమామహేశ్వరరావు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ తెలుగుదేశం జనసేన పొత్తు రాష్ట్ర భవిష్యత్తు కోసమేనని తెలియజేశారు. ఈనెల 17వ తేదీన ఉమ్మడి మేనిఫెస్టోతో కొండపల్లి మునిసిపాలిటీలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తామని తెలియజేశారు. అదేవిధంగా 18వ తేదీన జి.కొండూరు-సున్నప్పాడు రోడ్డు దుస్థితిని తెలియజేసే విధంగా జనసేన మరియు టిడిపి పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం, 19వ తేదీన రెడ్డిగూడెం ప్రధాన రహదారి దుస్థితి గురించి నిరసన కార్యక్రమం చేపడతామని మీడియాకు వివరించారు. దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రేపు16వ తేదీ ఉదయం 9గంటలకు బూడిద చెరువులో జరుగుతున్న అవినీతి గురించి, అక్కడ జరుగుతున్న దోపిడీ గురించి జనసేన మరియు టిడిపి పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరుగుతుంది అని తెలియజేశారు. వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ 2024 ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గ ప్రజలు నీకు టీకా వేస్తారని చమత్కరించారు. ఇక నుండి జనసేన మరియు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడిగా కార్యక్రమాల నిర్వహణ ఉంటుందని తెలియజేశారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాల పైన, అవినీతిపైన రెండు పార్టీలు కలిసి రాజీలేని పోరాటం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ మైలవరం మండల అధ్యక్షులు శీలం బ్రహ్మయ్య, జిల్లా కార్యదర్శి చింతల లక్ష్మికుమారి, ఎంపీటీసీ తేజ, నాయకులు చంద్రాల మురళీకృష్ణ, పొన్నూరు విజయ్ కుమార్, రవితేజ, పసుపులేటి నాగరాజు, ఆనం విజయకుమార్, వీర్ల పౌల్ రాజ్, తోట మాధవరావు, తెలుగుదేశం నాయకులు లంకా లితీష్, బుల్లి బాబు, బందలపాటి సుధాకర్, బండి నాగరాజు, మోర్ల రోశాలు, బాజీ, ప్రత్తిపాటి ప్రభాకర్, మల్లెల రాధాకృష్ణ, వరికూటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.