జనసేన – టిడిపి సమన్వయంతో పనిచేసి ప్రజల మెప్పు పొందాలి

  • గాజువాక నియోజకవర్గం ఇన్చార్జ్ కోన తాతారావు

గాజువాక నియోజకవర్గం: గాజువాకలో జనసేన పార్టీ పీఏసీ సభ్యులు మరియు గాజువాక నియోజకవర్గం ఇన్చార్జ్ కోన తాతారావు అధ్యక్షతన పార్టీ నాయకులు, కార్యవర్గం, జనసేన పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. ఎలక్షన్ ప్రక్రియ లో అందరూ భాగస్వామ్యం కావాలని, బూతు స్థాయిలో ప్రజలతో మమేకం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలు జనసేన తెలుగుదేశం కు మద్దతుగా ఉన్న తరుణంలో ఇరు పార్టీలు సమన్వయం తో పని చేయాలని సూచించారు. పార్టీ శ్రేణులు ప్రజల దీర్గ కాలికంగా ఉన్న సమస్యల పట్ల పోరాడాలని, గడిచిన 5 సంవత్సరాలలో నిత్యవసరసతులు కల్పన లో వైసిపి ప్రభుత్వం విఫలం ఐయ్యిందని, చరిత్ర లో ఎన్నడూ లేని విధంగా నిత్యవసర వస్తువుల ధరలు పెంచి ప్రజలను పట్టి పీడిస్తున్న వైసిపి ప్రభుత్వానికి చరమగీతం పడాలని ప్రజలను కోరాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గడసాల అప్పారావు, రూరల్ ప్రధాన కార్యదర్శి ఇందల వెంకట రమణ, 64వ వార్డు కార్పొరేటర్ దల్లి గోవింద్ రెడ్డి, గంధం వెంకటరావు, పోల రౌతు వెంకట రమణ, గవర సోమశేఖర్, లంకల మురళి దేవి, రౌతు గోవిందరావు, మాక షాలిని, సిరిసపల్లి కనకరాజు, మెడిశెట్టి విజయ్, గలకోటి సోమన్న, వబ్బిన శ్రీకాంత్, కాద శ్రీను, చైతన్య కృష్ణ, కళావతి, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.