మామిడికుదురులో అంగన్వాడిల నిరవధిక సమ్మెకు జనసేన-టిడిపిల మద్దతు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, మామిడికుదురు గ్రామంలో అంగన్వాడి వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ వారు చేస్తున్న అంగన్వాడీల నిరవధిక సమ్మెలో పాల్గొని మద్దతు తెలిపిన జనసేన పార్టీ -టిడిపి పార్టీ నాయకులు. మిమ్మల్ని జగన్ రెడ్డి ప్రభుత్వం ఇంత బాధ పెడుతుందంటే తప్పనిసరిగా ఆలోచించాలి. మీరు చెప్పిన సమస్యలు అన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఏకైక నాయకుడు మంచి మనసున్న నాయకుడు పవన్ కళ్యాణ్, సుదీర్ఘ అనుభవం ఉన్న విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు తప్పనిసరిగా వారి ముందుకి తీసుకుని వెళ్తాము. ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం మిమ్మల్ని ఎలా పట్టించుకోవాలో తెలియదు భావితరాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియదు, మిమ్మల్ని కాదు ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల వారిని ఇదే విధంగా బాధపెడుతున్నాడు. మీరు చేస్తున్న ఈ నిరాహార దీక్ష కార్యక్రమానికి నూటికి నూరు శాతం జనసేన పార్టీ-టీడీపీ పార్టీ మద్దతు ఉంటుంది. తప్పనిసరిగా మీతో చివరి వరకు నడుస్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రాజేశ్వరరావు జనసేన టిడిపి సమన్వయకర్త గుండుబోగుల పెద్దకాపు, టిడిపి రాజోలు ఇంచార్జ్ గొల్లపల్లి సూర్యరావు, జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు టిడిపి నాయకులు పాల్గొన్నారు.