జనసేన-టిడిపి టార్గెట్ 2024

  • పక్కా వ్యూహంతో జనసేన-టిడిపి ఆత్మీయ సమావేశాలు
  • జనసేన జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ తో చల్లా బాబు బేటీ
  • తిరుపతి నియోజకవర్గ సమన్వయ సమావేశంపై నగర కమిటీతో భేటీ అయిన డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్

తిరుపతి, వచ్చే ఎన్నికలే టార్గెట్ గా జనసేన-టిడిపి సమన్వయంతో పనిచేస్తున్నాయని జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు. మంగళవారం ఆయనతో పుంగనూరు టిడిపి ఇన్చార్జ్ చల్లా బాబు తిరుపతిలో భేటీ అయ్యారు. పుంగనూరు నియోజకవర్గంలో జనసేన-టిడిపి ఉమ్మడిగా పనిచేసి వైసిపిని ఇంటికి సాగనంపాలన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ పుంగనూరు నియోజకవర్గంలో జనసేన చాలా బలంగా ఉందని, అందరు నాయకులు కలుపుకొని పోవాలని సూచించారు. ప్రోటోకాల్ ఇబ్బంది లేకుండా చూస్కోవాలన్నారు. ఈనెల 17న పుంగనూరులో నియోజకవర్గ స్థాయి సమావేశం జరుగుతుందని, అందులో ఉమ్మడిగా చేపట్టవలసిన ఆందోళనలపై చర్చిస్తామన్నారు.జనసేన-టిడిపి ఉమ్మడి పోరాటాలతో వైసిపిని గద్దె దింపడం ఖాయమన్నారు.

తిరుపతి నగర కమిటీ భేటీ

తిరుపతి నియోజకవర్గ సమన్వయ సమావేశానికి సంబంధించి మంగళవారం జనసేన నగర కమిటీతో జనసేన జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ భేటీ అయ్యారు. డివిజన్ అధ్యక్షులతో పాటు నగర కమిటీ నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. టిడిపితో ఉమ్మడిగా చేపట్టవలసిన కార్యక్రమాలను వారికి వివరించారు. అలాగే నియోజకవర్గంలో ఉన్న దొంగ ఓట్లపై దృష్టి సారించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి నగర అధ్యక్షులు రాజారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు మధు బాబు, రాష్ట్ర కార్యదర్శి అకేపాటి సుభాషిణి, నగర కమిటీ సభ్యులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

వసంతోత్సవం పూర్వజన్మ సుకృతం

  • తిరుచానూరు అమ్మవారి వసంతోత్సవంలో పాల్గొన్న మాజీ టిటిడి బోర్డు మెంబర్ పసుపులేటి హరిప్రసాద్

తిరుపతి, తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం జరిగిన వసంతోత్సవాల్లో మాజీ టిటిడి బోర్డు సభ్యులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ దంపతులు పాల్గొన్నారు. అమ్మవారి వాహనసేవను అనుసరిస్తూ వసంతోత్సవాల్లో పాల్గొన్నారు. భక్తులపై అమ్మవారి వసంతోత్సపు చందనాన్ని చల్లుతూ భక్త తన్మయత్వంలో మునిగిపోయారు. అమ్మవారి వసంతోత్సవాల్లో పాల్గొనడం పూర్వజన్మ సుకృతమని ఈ సందర్భంగా డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ అన్నారు. అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భక్తులు పాల్గొని అమ్మవారి సేవలో తరించాలని కోరారు.