విజ్జేశ్వరంలో జనంలోకి జనసేన

నిడదవోలు నియోజకవర్గం, నిడదవోలు మండలం, విజ్జేశ్వరం గ్రామంలో జనసేనపార్టీ నిడదవోలు మండల అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం (పివిఆర్) ఆధ్వర్యంలో జనంలోకి జనసేన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోలిరెడ్డి వెంకటరత్నం మాట్లాడుతూ ప్రతి ఒక్కరు రానున్న ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేయాలని కోరారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే సామాన్య ప్రజలకు మంచి చేసే విధంగా పవన్ కళ్యాణ్ పని చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ప్రియా సౌజన్య, కాకర్ల నాని, నిడదవోలు పట్టణ నాయకులు రంగా రమేష్, నిడదవోలు మండల వైస్ ప్రెసిడెంట్లు వాకా ఇంద్రగౌడ్, మేడా పూర్ణ చంద్రరావు, జిల్లా ప్రోగ్రామ్స్ కమిటీ సభ్యులు, మండల కార్యవర్గ సభ్యులు, విజ్జేశ్వరం గ్రామ జనసేన నాయకులు, వివిధ గ్రామ జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.