నెల్లూరు జనసేన ఆధ్వర్యంలో జనంలోకి జనసేన

  • నెల్లూరు మూడో డివిజన్ లో మనుక్రాంత్ రెడ్డి పర్యటన

నెల్లూరు: జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనసేన పార్టీ జనంలోకి జనసేన కార్యక్రమంలో భాగంగా నేడు నెల్లూరు నగరంలోని మూడో డివిజన్లో అనేక ప్రాంతాల్లో జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మనుక్రాంత్ రెడ్డి మాట్లాడుతూ.. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తన నియోజకవర్గంలో కనీసం స్వచ్ఛమైన తాగునీటిని కుడా ప్రజలకు అందించలేని పరిస్థితి లో వున్నారని, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రతి ఇంటి ముందు ఎదో చుట్టం చూపుగా వచ్చి వెళ్తున్నారు తప్ప ప్రజా సమస్యలపై తెలుసుకునే పరిస్థితిలో లేరని తెలియజేసారు. డివిజన్ లో పర్యటిస్తున్న తమ దృష్టికి అనేకమంది వృద్ధులు తమకు అకారణంగా పెన్షన్లు తొలగించారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని, నెల్లూరు నగర నియోజకవర్గంలో జనసేన పార్టీ విజయం సాధిస్తుందని ఆయన తెలియజేసారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు, రాష్ట్ర కార్యనిర్వాహక కొట్టే వెంకటేశ్వర్లు జిల్లా అధికార ప్రతినిధి కారంపూడి కృష్ణ రెడ్డి జిల్లా కార్యదర్శి షేక్ అలియా, గుడి హరి రెడ్డి, నగర ప్రధాన కార్యదర్శి వరకుమార్ నగర కార్యదర్శి అక్కిశెట్టి శ్రీధర్, మూడవ డివిజన్ ఇంచార్జి శ్రీకాంత్ నగర డివిజన్ ఇంచార్జులు సుల్తాన్, వినయ్ నగర మహిళా నాయకులు సావిత్రి తదితరులు పాల్గొన్నారు.