జనసేనాని నిర్ణయం చరిత్రాత్మకం: ఆగూరు మనీ

  • తెలుగుదేశం రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన పార్వతీపురం జనసేన

పార్వతీపురం నియోజకవర్గం: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అరెస్టు తీరును నిరసిస్తూ పార్వతీపురంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చేపడుతున్న నిరసన కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ పార్వతీపురం మండల అధ్యక్షురాలు ఆగూరు మనీ ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని, సంఘీభావం తెలియజేయడం జరిగింది. రాష్ట్ర ప్రజల బాగు కోరి, రాష్ట్రాన్ని కాపాడేందుకే టిడిపితో జనసేనాని పవన్ కళ్యాణ్ పొత్తు ప్రకటించారని జనసేన పార్టీ మండల అధ్యక్షురాలు ఆగూరు మనీ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో పొత్తును స్పష్టం చేయటం ఆనందదాయకంగా ఉందన్నారు. ఆపదలో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడేందుకు తమ జనసేనాని పొత్తును ప్రకటించారన్నారు. ఆంధ్ర రాష్ట్రం ఉన్న కష్టకాలాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు, గుర్తించాలన్నారు. సమర్థతలేని పాలకులు చేతిలో రాష్ట్రం ఆదోగతి పాలు అయిందన్నారు. దాదాపుగా వ్యవస్థలన్నీ చిన్నా భిన్నం అయ్యాయన్నారు. కాబట్టి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అందుకే జనసేనాని పవన్ కళ్యాణ్ టిడిపితో పొత్తు ప్రకటించారన్నారు. ఇకపై పార్వతీపురంలో టిడిపి, జనసేన పార్టీలు రెండు కలిసి పని చేస్తామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి, ప్రజల పక్షాన ఉమ్మడి పోరు చేస్తామని చెప్పారు. జనసేన పార్టీ బలిజిపేట మండల అధ్యక్షులు బంకురు పోలినాయుడు, జనసేన పార్టీ వీరమహిళలు బోనుల గోవిందమ్మ(ఇందు), జనసేన పార్టీ నాయకులు ఖాతా విశ్వేశ్వరరావు, చిట్లు గణేశ్వరరావు, గుంట్రెడ్డి గౌరీ శంకర్, స్వామి నాయుడు, అప్పలనాయుడు, ఆదినారాయణ, కర్రీ మణికంఠ, అక్కెన భాస్కర్, తిరుమలరెడ్డి కనకరాజు, పాత్ర పవన్, పైళ్ల అప్పలరాజు, చెరుకు బిల్లి అనిల్, ఆనంద్, జంబాడ శంకర్, అశోక్, మహేష్, సాయి, ప్రశాంత్, పార్వతిపురం జనసైనికులు, కార్యకర్తలు, అలాగే బలిజిపేట జనసైనికులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.