దివ్యాంగులకు అండగా యూఏఈ జనసేన పవన్ సేన

  • పెనుమల జాన్ బాబు ఆధ్వర్యంలో గృహ నిర్మాణం

పి. గన్నవరం నియోజకవర్గం: ఇరుసుమండ గ్రామంలో చిల్లి అంబేద్కర్ వారి సతీమణి బేబీ కుమారి (దివ్యాంగులకు) కి సుమారు రెండు లక్షల రూపాయల వ్యయంతో పి.గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో పెనుమాల జాన్ బాబు వారి మిత్ర బృందం కొమ్ముల వేణు, మండెల నాగ, మండెల గోపాల్ గృహం నిర్మించడం జరిగింది. బుధవారం జరిగిన బేబీ కుమారి గృహప్రవేశ కార్యక్రమంలో మండలం సమైక్య అధ్యక్షుడు ఆదిమూలం సూరయ్య కాపు, ఇరుసుమండ గ్రామ సర్పంచ్ అక్కిశెట్టి నాగమణి వీర వెంకట సత్యనారాయణ, తొండవరం ఉప సర్పంచ్ దిగుమర్తి చిట్టిబాబు, పాశర్లపూడి జనసేన పార్టీ ఎంపీటీసీ చెరుకూరు సత్తిబాబు, కొమ్ముల మాధవరావు, డి వి.వి సత్యనారాయణ, పత్తి దత్తుడు, నేరేడుమిల్లి రఘు, తోట శ్రీను, కంకిపాటి నరసింహారావు, చింతపల్లి సీతారాం, షేక్ సుభాని, బండి మణికంఠ, మంచాల నోకేష్, కందాల సూర్య చందర్రావు, వి.వెంకటేశ్వరరావు, ఆకుల నాని, కుడుపూడి సత్యనారాయణ, జాన సుబ్రహ్మణ్యం, మరియు జనసేన నాయకులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.