జనసేన భారీ ర్యాలీ

జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని 28వ డివిజన్ అధ్యక్షుడు మామిడి రామారావు ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో భారీ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 29వ డివిజన్ అధ్యక్షుడు పసుపులేటి నరసింహారావు, 30వ డివిజన్ అధ్యక్షుడు దాసరి వెంకటేశ్వరరావు, నగర సంయుక్త కార్యదర్శి శ్రీపతి భూషయ్య, 23వ డివిజన్ అధ్యక్షుడు దళవాయి కిషోర్, 24వ డివిజన్ ఉపాధ్యక్షుడు గిరి, కొత్తకోటి ప్రసాద్, ఖరీదు కోటేశ్వరరావు, పవన్, స్థానిక నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం పిఠాపురంలోని చిత్రాడ బహిరంగ సభకు భారీ ఎత్తున జనసేన నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా జనసేన పార్టీని బలోపేతం చేయడంలో ప్రతి ఒక్కరి సహకారం అమూల్యమని నేతలు పేర్కొన్నారు.

WhatsApp-Image-2025-03-14-at-8.02.43-PM-1-459x1024 జనసేన భారీ ర్యాలీ

Share this content:

Post Comment