జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని, పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు గురువారం ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర రావు మరియు గూడూరు నియోజకవర్గం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ (పి.ఓ.సి) కె.మోహన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించబడింది. గమల్లపాలెంలోని గూడూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయం నుండి జనసేన నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు పలు వాహనాల్లో ఊరేగింపుగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా పి.ఓ.సి కె.మోహన్ మాట్లాడుతూ, జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పిఠాపురంలో “జయకేతనం” పేరుతో ఘనంగా నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ఈ సభకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు మరియు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు హాజరై కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి అధికారంలోకి వచ్చే వరకు నిస్వార్థంగా పనిచేసిన ప్రతి కార్యకర్త, జనసైనికుడు, వీరమహిళ ఈ సభను విజయవంతం చేయాలని కోరారు. ఆవిర్భావం నుండి అభివృద్ధి వరకు పార్టీతో పాటు నిలిచిన ప్రతి ఒక్కరు ఈ వేడుకలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పాలిచర్ల భాస్కర్, గోనూ క్రాంతి కుమార్, పట్టణ కార్యదర్శి ఉప్పు సాయి కిరణ్, చిలుకూరు మండలం నాయకులు కార్తీక్, మహేష్, సుధీర్, శివాజీ, కోట మండలం నాయకులు వెంకయ్య, గురు బాబు, కోటయ్య, చిట్టమూరు నాయకులు అక్బర్, కుమార్, భాస్కర్, వాకాడు నాయకులు సునీల్ తదితరులు పాల్గొన్నారు. జనసైనికులుగా నవీన్, విజయ్, వెంకటేష్, భార్గవ్, హరి, మస్తాన్, శ్రీనివాసులు, మురళి, విశ్వ, స్వరూప్ ఇతరులు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Share this content:
Post Comment