జనంకోసం జనసేన మహాపాదయాత్రకు విశేష ఆదరణ

రాజానగరం, సీతానగరం మండలం, సింగవరం గ్రామంలో శనివారం జరిగిన జనంకోసం జనసేన, మహాపాదయాత్ర 35 వ రోజులో భాగంగా రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకురాలు, ‘నా సేన కోసం నా వంతు’ కమిటీ కో ‘ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి గ్రామంలో ప్రతి ఇంటికి తిరుగుతూ జనసేన పార్టీకి ఈసారి ఒక అవకాశం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితేనే సామాన్య ప్రజల జీవితాలు మెరుగుపడతాయని అందరూ ఈసారి జనసేన పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థిస్తూ జనసేన పార్టీ విధివిధానాల ముద్రించిన కరపత్రాలను పంచుతూ సింగవరం గ్రామ ప్రజల ఆదరాభిమానాలతో కార్యక్రమం విజయవంతం అయింది. ఈ కార్యక్రమంలో మట్ట వెంకటేశ్వర్రావు, ప్రశాంత్ చౌదరి, కాండ్రేకుల పోసిరత్నం, మద్దాల యేసుపాదం, మట్ట సుబ్రహ్మణ్యం, కొండాటి సత్యనారాయణ, చీకట్ల వీరాజు, బండి సత్యప్రసాద్, పిండి వివేక్, కొట్టు రవీంద్ర, చిక్కం నాగేంద్ర, బ్రహ్మం, కిల్లాడి వీరయ్య, బి ప్రసాద్, మద్దిరెడ్డి బాబులు, తోట అనిల్ వాసు, దొడ్డా బాలకృష్ణ, పుణ్యక్షేత్రం జనసైనికులు, సీతానగరం మండల జనసేన శ్రేణులు పాల్గొన్నారు.