*చరిత్రలో నిలిచేలా “జయకేతనం” సభ
*ప్రజల మనసులు గెలుచుకున్న మహా నాయకుడు – పవన్ కళ్యాణ్
*భారతదేశ రాజకీయ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ నాయకుడిగా పవన్ కళ్యాణ్
పిఠాపురంలో జరగనున్న జనసేన 12వ ఆవిర్భావ సభ చరిత్రలో నిలిచిపోయేలా ఘనంగా జరగనుందని జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్ళ హరి పేర్కొన్నారు. రాష్ట్రం నుంచే కాకుండా, విదేశాల నుండి కూడా జనసేన శ్రేణులు ఈ మహా సభకు తరలి వస్తున్నారని తెలిపారు. శుక్రవారం జరగనున్న ఈ సభకు “జయకేతనం” అనే పేరును పవన్ కళ్యాణ్ గారు పెట్టిన సందర్భంగా, స్థానిక శ్రీనివాసరావు తోటలో “జయ జయ హే జయకేతనం” పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ..”ఇళ్లేమో దూరం, దారంతా గతుకులు, అసలే చీకటి… కానీ గుండె నిండా దైర్యం ఉందంటూ పవన్ కళ్యాణ్ వేసిన ఒక్క అడుగు నేడు ఉప్పెనలా మారింది.” రాజకీయాల్లో మార్పు కోసం జనసేన ప్రారంభించిన ప్రయాణం, డబ్బు, కులం, అవినీతి, బందుప్రీతి వంటి కలుషితమైన వ్యవస్థను ఎదుర్కొంటూ ముందుకెళ్తోందన్నారు. రాజకీయాలు ధనవంతులవే కాదని, నిజాయితీగా ప్రజాసేవ కోసం పనిచేసే వారికీ అవకాశం ఉంటుందని జనసేన నిరూపించిందని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ అనేక అవమానాలు, నిందలు భరించి కూడా ప్రజల కోసం నిలబడిన ఆదర్శ నాయకుడు అని కొనియాడారు. రాజకీయ ప్రయాణంలో ఎదురైన ప్రతి అడ్డంకిని అధిగమించి, దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన మహా నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు ఎదిగారని ప్రశంసించారు. జనసేన పార్టీలో సభ్యత్వం పొందడం, పవన్ కళ్యాణ్ బాటలో నడవడం గర్వకారణమని ఆళ్ళ హరి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నగర నాయకులు మెహబూబ్ బాషా, కొత్తకోట ప్రసాద్, కోలా అంజి, వడ్డె సుబ్బారావు, నండూరి స్వామి, స్టూడియో బాలాజీ, తాడికొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment